DAV public school
-
Banjara Hills: ఉద్రిక్త వాతావరణం నడుమ తెరుచుకున్న డీఏవీ స్కూల్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని బాదం సరోజా దేవి డీఏవీ పబ్లిక్ స్కూల్ రెండు వారాల అనంతరం గురువారం ఉద్రిక్త వాతావరణం నడుమ తెరుచుకుంది. గత నెల 18వ తేదీన స్కూల్లో డ్రైవర్‌గా పని చేస్తున్న రజనీకుమార్ నాలుగున్నరేళ్ల ఎల్కేజీ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితులతో ఆపటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. అప్పటి నుంచి స్కూల్‌ను మూసివేశారు. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు విద్యాశాఖ అధికారులు స్కూల్ రీఓపెన్‌కు అనుమతులిచ్చారు. డీఏవీ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు అయితే తమకు న్యాయం జరగకుండానే స్కూల్‌ను ఎలా తెరుస్తారంటూ గురువారం ఉదయం బాధిత చిన్నారి తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వారిని సముదాయించి అక్కడి నుంచి తరలించారు. సుమారు గంటపాటు బాధిత చిన్నారి తల్లిదండ్రులు అక్కడే బైఠాయించారు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా, న్యాయం చేయకుండా తెరవడం అన్యాయమంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని తమ పిల్లల భవిష్యత్‌ను పాడుచేయవద్దంటూ వేడుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎటువంటి గొడవలు చోటు చేసుకోకుండా ఉండేందుకు బంజారాహిల్స్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా తరగతులు ప్రారంభం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. చాలా మంది తల్లిదండ్రులు ఏమవుతుందోనన్న బెంగతో ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ వద్దే కాపుకాశారు. మొదటి రోజున 98 శాతం హాజరు నమోదైంది. పాఠశాలలో గుర్తించిన 40 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రయత్నాలు డీఏవీ పబ్లిక్ స్కూల్లో గత నెల 18వ తేదీన నాలుగున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన డ్రైవర్ రజనీకుమార్, నిర్లక్ష్యం వహించిన ఇన్చార్జి హెచ్ఎం మాధవిలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా ఈ ఘటనపై సత్వర న్యాయం జరిగే విధంగా ఫాస్ట్‌ట్రాక్ ఏర్పాటు కోసం పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. మరో పది రోజుల్లో నిందితుల చార్జిషీట్‌ను దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. చార్జిషీట్ దాఖలు కాగానే ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన విచారణ జరిగే విధంగా పోలీసులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి పకడ్బందీ శాస్త్రీయ ఆధారాలను ప్రవేశ పెట్టడం ద్వారా నిందితులకు తగిన శిక్ష పడే విధంగా చార్జిషీట్‌ను కూడా రూపొందిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే బాధిత బాలిక వాంగ్మూలాన్ని న్యాయమూర్తి సమక్షంలో రికార్డు చేశారు. ఈ కేసులో బాధితురాలు వాంగ్మూలం కీలకం కానుంది. -
హెచ్ఎం చనువుతో.. టీచర్‌గా మారిన డ్రైవర్
సాక్షి, బంజారాహిల్స్: డ్రైవర్‌గా ఉండాల్సిన వ్యక్తి సదరు స్కూల్ హెచ్ఎం ఇచ్చిన చనువుతో ఏకంగా టీచర్‌గా మారాడు. ప్రతిరోజూ ఎల్కేజీ విద్యార్థులకు హాజరు తీసుకోవడంతో పాటు క్లాస్‌లు కూడా చెప్పేవాడు. ఇదే చనువుతో ఎల్కేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఘటనలో ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు. సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ రోడ్ నెం. 14 డీఏవీ పబ్లిక్ స్కూల్లో అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు రజనీకుమార్, హెచ్ఎం మాధవిల కస్టడీ మంగళవారంతో ముగిసింది. వీరిని బుధవారం తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీ విచారణలో పోలీసులు పలు విషయాలను రాబట్టారు. నిందితుడు రజనీకుమార్ పాఠశాలలో అన్ని తానై వ్యవహరించడమే కాకుండా ఏకంగా క్లాస్ తీసుకునేవాడని విచారణలో తేలింది. ప్రతిరోజూ ఓ క్లాస్ తీసుకోవడమే కాకుండా చిన్నారుల హాజరును కూడా నమోదు చేసేవాడని గుర్తించారు. పాఠశాలలోని సీసీ కెమెరాల వ్యవస్థ మొత్తం ఆయన పర్యవేక్షణలోనే ఉండటంతో తన అక్రమాలు వెలుగు చూడకుండా కొన్ని సీసీ కెమెరాల వైర్లను కట్ చేసిన విషయాన్ని నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. కొందరు టీచర్లు నిందితుడిపై ఫిర్యాదు చేసినా హెచ్ఎం మాధవి నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం కూడా విచారణలో వెలుగు చూసింది. పాఠశాలలో ఏదైనా కార్యక్రమం జరిగితే తల్లిదండ్రులు డబ్బులను నేరుగా నిందితుడి అకౌంట్లోకే పంపించేవారని పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌గా ఉండాల్సిన నిందితుడు టీచర్ అవతారం ఎత్తడంతో ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. స్కూల్లో ఇష్టారాజ్యం నెలకొనడం, క్రమ శిక్షణ లేకపోవడం ఇవన్నీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ మాధవి నిర్వాకంతోనే జరిగినట్లుగా తేలింది. -
Banjarahills: డీఏవీ స్కూల్ రీ ఓపెన్.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో హర్షం
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని బాదం సరోజా దేవి డీఏవీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు భారీ ఊరట లభించింది. పాఠశాలను తెరిచేందుకు అనుమతులు జారీ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారిణి రోహిణి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. దీంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్ ఏమవతుందోనని గత పది రోజులుగా ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు విద్యాశాఖ అధికారులు రిలీఫ్‌నిచ్చారు. గత నెల 18వ తేదీన స్కూల్ డ్రైవర్ రజనీకుమార్ ఇదే పాఠశాలలో చదువుతున్న నాలుగున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడగా నిందితుడిని, ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పాఠశాలలో నిర్లక్ష్యం తాండవం చేస్తోందంటూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గత నెల 22వ తేదీన స్కూల్ అనుమతులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో స్కూల్‌ను బంజారాహిల్స్‌లోని పాత భవనంలోనే కొనసాగించాలంటూ గత నెల 23వ తేదీన 650 మంది విద్యార్థుల తల్లిదండ్రులు బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద సమావేశమై భారీ ఆందోళన చేపట్టారు. ఆ రోజు నుంచే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు డీఈఓ రోహిణిని కలుస్తూ ఇక్కడే పాఠశాలను రీ ఓపెన్ చేయాల్సిందిగా డిమాండ్ చేయసాగారు. బ్యాలెట్‌తో అభిప్రాయ సేకరణ.. మొత్తం తల్లిదండ్రులంతా ఒక్కతాటిపైకి వచ్చి తమ పిల్లలను ఇదే స్కూల్లో చదివించేందుకు అనుమతించాలంటూ ఇక్కడే స్కూల్ ఓపెన్ చేయాలని అభిప్రాయ సేకరణకు బ్యాలెట్ పద్ధతిని నిర్వహించారు. ఇందుకు 95 శాతం మంది తల్లిదండ్రులు మద్దతిచ్చారు. తల్లిదండ్రులంతా వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే తల్లిదండ్రులతో కూడిన ఓ కోర్ కమిటీ కూడా ఏర్పడింది. వీరు ప్రతిరోజూ సంబంధిత అధికారులను కలుస్తూ స్కూల్‌ను తెరవాలంటూ డిమాండ్ చేయసాగారు. ఇటీవలే ఢిల్లీ నుంచి స్కూల్ డైరెక్టర్ నిషా కూడా ఇక్కడికి వచ్చి తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. డీఈఓ కూడా తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఎట్టకేలకు స్కూల్ రీఓపెన్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేయగా గురువారం నుంచి బంజారాహిల్స్‌లోనే స్కూల్ తెరవనున్నారు. దీంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ ఆందోళనకు ప్రభుత్వం స్పందించిందని కోర్ కమిటీ ప్రతినిధి పెద్దల అంజిబాబు వెల్లడించారు. -
చర్చలు సఫలం.. వారంలో డీఏవీ స్కూల్ రీఓపెన్..!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ వారం రోజుల్లో తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాఠశాలను తిరిగి తెరిచే విషయంపై.. విద్యాశాఖ కమిషనర్‌తో డీఏవీ స్కూల్ యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రుల చర్చలు సఫలమయ్యాయి. కమిషనర్‌తో భేటీ అనంతరం పలు వివరాలు వెల్లడించారు పేరెంట్స్. ‘కమిషనర్‌కు అన్ని విషయాలు తెలియజేశాం. కమిషనర్ సానుకూలంగా స్పందించారు. స్కూల్ అనుమతులపై పునరాలోచించేందుకు అంగీకరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తాము ఇచ్చిన సూచనలు కమిషనర్ పరిగణనలోకి తీసుకున్నారు’ అని పేర్కొన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. స్కూల్ మేనేజర్ శేషాద్రి ఏం చెప్పారంటే.. ‘కమిషనర్ దేవసేనను మా డీఏవీ డైరెక్టర్ నిషాతో పాటు ముగ్గురు ప్రతినిధులు వచ్చి కలిశారు. కమిషనర్ దేవసేన లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చాం. ఘటనపై విచారం వ్యక్తం చేసి లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పాం. పేరెంట్స్ స్టేట్ మెంట్స్‌తో కలిపి మా వినతిని కూడా అందించాం. గుర్తింపు రద్దు తొలగించాలని కోరాం. ప్రభుత్వానికి ఈ రిక్వెస్ట్‌లను తీసుకెళ్తామని కమిషనర్ చెప్పారు. సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం.’ అని కమిషనర్ భేటీ అనంతరం వెల్లడించారు డీఏవీ స్కూల్ మేనేజర్. ఇదీ సమస్య.. హైదరాబాద్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ క్రమంలో పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అయితే, విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాల గుర్తింపు రద్దు చేయడంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళనకు గురైన తల్లిదండ్రులు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచారు. దీంతో పాఠశాలను తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: Hyderabad: డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దుపై గందరగోళం.. నిర్ణయమెటో? -
విద్యాబుద్ధులు నేర్పే బడుల్లో దారుణాలు
-
DAV స్కూల్ గుర్తింపు రద్దుతో అయోమయంలో పేరెంట్స్
-
బంజారాహిల్స్ డీఏవీ పాఠాశాల గుర్తింపు రద్దు
-
విజృంభించిన క ళ్యాణ్ సాత్విక్
జింఖానా, న్యూస్‌లైన్: సెయింట్ జోసెఫ్ హైస్కూల్ (హబ్సిగూడ) బౌలర్ కళ్యాణ్ సాత్విక్ (7/7) విజృంభించాడు. దీంతో హెచ్‌సీఏ బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 నాకౌట్ టోర్నీలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సెయింట్ జోసెఫ్ హైస్కూల్ 462 పరుగుల తేడాతో పీబీ డీఏవీ పబ్లిక్ స్కూల్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ జోసెఫ్.. బ్యాట్స్‌మన్ ప్రత్యూష్ (308 నాటౌట్) ట్రిపుల్ సెంచరీతో అజేయంగా నిలవడంతో నాలుగు వికెట్లకు 486 పరుగులు చేసింది. ప్రతాప్ రెడ్డి (101) సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన డీఏవీ పబ్లిక్ స్కూల్.. బౌలర్ కళ్యాణ్ ధాటికి 25 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్‌లో మహేష్ విద్యాభవన్ బౌలర్ కమల్ కుమార్ చౌదరి 7 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. దీంతో ఆ జట్టు 184 పరుగుల తేడాతో కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌పై ఘన విజయం సాధించింది. మొదట బరిలోకి దిగిన మహేష్ విద్యాభవన్ 243 పరుగుల వద్ద ఆలౌటైంది. అజయ్ సింగ్ (44), కమల్ చౌదరి (39), ఓంకార్ గుంజల్ (35) మెరుగ్గా ఆడారు. కృష్ణవేణి స్కూల్ బౌలర్ గౌరీశంకర్ 3 వికెట్లు చేజిక్కించుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన కృష్ణవేణి స్కూల్ 59 పరుగులకే ఆలౌటైంది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ప్రోగ్రెసివ్ హైస్కూల్: 52 (కైలాష్ 5/14); జాన్సన్ గ్రామర్ స్కూల్: 53/4 (ఫైజల్ అలీ 3/28). విజ్ఙాన్ విద్యాలయ: 291/7 (విష్ణువర్ధన్ 107, నిఖిల్ 108); నల్గొండ డిస్ట్రిక్ట్: 160 (హేమచంద్ర 56; సిద్ధార్థ్ 3/40, కుందన్ 4/32). శ్రీనిధి: 188/7 (మహ్మద్ అలీ 62); సెయింట్ అల్లాయ్సిస్ హైస్కూల్: 190/9 (సాయి అఖిల్ 70 నాటౌట్; వినీత్ 4/40). వరంగల్ డిస్ట్రిక్ట్: 262/9 (నిఖిల్ రెడ్డి 31, అజయ్ 31, పవన్ 33; మహేష్ 3/12); ఫాస్టర్ బిల్లా బంగ్ హైస్కూల్: 91 (మహేష్ 44).