క్వార్టర్స్‌లో సాకేత్ జంట | Saketh Myneni upsets top seed at Hong Kong Challenger | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సాకేత్ జంట

Published Thu, Jan 29 2015 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

Saketh Myneni upsets top seed at Hong Kong Challenger

ఏటీపీ చాలెంజర్ టోర్నీ
 హాంకాంగ్: హాంకాంగ్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో సాకేత్-సనమ్ సింగ్ (భారత్) జోడీ 4-6, 6-3, 10-4తో ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్)-పురవ్ రాజా (భారత్) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో రామ్‌కుమార్ 3-6, 6-4, 4-1తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి యాన్ బాయ్ (చైనా) వైదొలిగాడు. తదుపరి రౌండ్‌లో సాకేత్‌తో రామ్‌కుమార్ ఆడతాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement