పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ లో భారత్ కథ ముగిసింది. భారత క్రీడాకారిణి సానియా మీర్జా జోడీకి క్వార్టర్స్ లో చుక్కెదురైంది. ఈ రోజు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సానియా(భారత్)- కారా బ్లాక్(జింబాంబ్వే) జోడీ 2-6, 6-3, 3-6 తేడాతో సు వే షా(చైనీస్ తైపాయ్), షూయ్ పెంగ్ (చైనా)చేతిలో ఓటమి పాలైంది. దీంతో సానియాపై పెట్టుకున్న భారత్ ఆశలు ఆవిరైయ్యాయి. తొలి సెట్ ను చేజార్చుకున్న సానియా జోడీ..ఆపై రెండో సెట్ ను గెలుచుకుని విజయం దిశగా పయనించినట్లు కనిపించింది. కాగా, మూడో సెట్ లో పోరాట పటిమ లోపించడంతో ఓటమి తప్పలేదు.