న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్, ఆరు గ్రాండ్‌స్లామ్‌ల విజేత సానియా మీర్జా జాతీయ జట్టు తరఫున కూడా పునరాగమనానికి సిద్ధమైంది. ఫెడరేషన్ కప్‌లో పాల్గొనే ఐదుగురు సభ్యుల భారత జట్టులో డబుల్స్ మాజీ వరల్డ్ నంబర్‌వన్ సానియాకు చోటు దక్కింది. చివరి సారిగా 2016లో చివరి సారిగా ఫెడ్ కప్ ఆడిన సానియా 2017 అక్టోబరు నుంచి ఆటకు దూరంగా ఉంది. భారత సింగిల్స్ నంబర్‌వన్ ప్లేయర్ అంకితా రైనాతో పాటు రియా భాటియా, రుతుజ భోంస్లే, కర్మన్ కౌర్ తాండి టీమ్‌లో మిగిలిన నలుగురు సభ్యులు. హైదరాబాద్ అమ్మాయి సౌజన్య భవిశెట్టి రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైంది. ఈ టీమ్‌కు మాజీ డేవిస్ కప్ ఆటగాడు విశాల్ ఉప్పల్ కెప్టెన్ గా, మరో మాజీ క్రీడాకారిణి అంకితా బాంబ్రి కోచ్‌గా వ్యవహరిస్తుంది. 2020లో తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్‌తో పాటు దానికి ముందు సన్నాహకంగా హోబర్ట్ ఇంటర్నేషనల్‌లో నాదియా కిచెనోక్ (ఉక్రెయిన్)తో కలిసి బరిలోకి దిగుతున్నట్లు సానియా ఇప్పటికే ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment