సాకేత్ నిష్ర్కమణ | sanket lost singles and doubles in ATP challenger tennis tournment | Sakshi
Sakshi News home page

సాకేత్ నిష్ర్కమణ

Published Fri, May 23 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM

sanket lost singles and doubles in ATP challenger tennis tournment

సింగిల్స్, డబుల్స్‌లో ఓటమి  
 ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీ
 
 కర్షి (ఉజ్బెకిస్థాన్): ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాకేత్ మైనేని ప్రస్థానం ముగిసింది. సింగిల్స్‌లో క్వార్టర్స్‌తోపాటు డబుల్స్‌లో సెమీఫైనల్లో ఓటమిపాలై టోర్నీ నుంచి సాకేత్ నిష్ర్కమించాడు. గురువారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 1-6, 2-6 తేడాతో నికొలజ్ బసిలాష్విలి చేతిలో ఓడాడు.
 
 ఆ తరువాత జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్ మైనేని-జేమ్స్ క్లస్కీ (ఐర్లాండ్) జోడి సెర్గీ బెటోవ్-అలెగ్జాండర్ బురీ చేతిలో ఓడింది. ఇక తమిళనాడుకు చెందిన జీవన్ నెడున్‌చెజియాన్ తన కెరీర్‌లో తొలిసారిగా ఈ టోర్నీలో సెమీస్‌కు చేరాడు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జీవన్ 6-3, 6-2 తేడాతో రష్యాకు చెందిన మైఖేల్ లెదోవ్‌స్కిను ఓడించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement