అబుదాబి: న్యూజిలాండ్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ సహనం కోల్పోయాడు. సహచర బౌలర్‌పైనే అరిచి తన ఆవేశాన్ని ప్రదర్శించాడు. ఫీల్డింగ్ సెట్ చేసినట్లు బౌలింగ్ వేయని స్పిన్నర్ బిలాల్ అసిఫ్‌కు క్లాస్ తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా టెయిలెండర్ ట్రెంట్ బౌల్ట్ క్రీజ్‌లో ఉన్నప్పుడు బిలాల్ బౌలింగ్ వేస్తున్నాడు. అయితే బిలాల్ కోరినట్లు ఫీల్డింగ్ సెట్ చేశాడు సర్ఫరాజ్.
కాగా, బిలాల్ బ్యాట్స్‌మన్‌కు దొరికేటట్లు ఒక లెంగ్త్ బాల్ సంధించాడు. ఆ బంతికి ముందుకొచ్చీ మరీ ఫోర్ బాదాడు బౌల్ట్. దాంతో చిర్రెత్తిన సర్పరాజ్.. ‘నువ్వు ఏమి చెప్పావ్.. ఎలా బౌలింగ్ వేశావ్’ అంటూ బిలాల్ చీవాట్లు పెట్టాడు. దాంతో చిన్నబోవడం బిలాల్ వంతైంది. అది కివీస్ తొలి ఇన్నింగ్స్ 66 ఓవర్‌లో చోటు చేసుకోగా, ఆ మరుసటి ఓవర్‌లో అజాజ్ పటేల్ చివరి వికెట్‌గా వికెట్‌గా ఔటయ్యాడు.ఫలితంగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకు ఆలౌట్ కాగా, న‍్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 249 పరుగులు చేసింది. దాంతో పాకిస్తాన్‌కు 176 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించింది.
Watch “sarfarazsofunnuy_edit_0_edit_0” on #Vimeo https://t.co/RQBDi6qN6p
— Sports Freak (@SPOVDO) 19 November 2018
Comments
Please login to add a commentAdd a comment