
హోచిమిన్ సిటీ (వియత్నాం): ఆసియా సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో మూడు పతకాలు ఖాయమయ్యాయి. ఆదివారం జరిగిన పోటీల్లో భారత బాక్సర్లు లైష్రామ్ సరితా దేవి (64 కేజీలు), సోనియా లాథెర్ (57 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో మఫ్తునాఖోన్ మెలియెవా (ఉజ్బెకిస్తాన్)పై సరితా దేవి; నాజిమ్ ఇషనోవా (కజకిస్తాన్)పై సోనియా; ఎర్దెనెతువా ఎంక్‌బాతర్ (మంగోలియా)పై లవ్లీనా విజయం సాధించారు. మరో క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో నీరజ్ (51 కేజీలు) చైనీస్ తైపీ బాక్సర్ చోల్ మి పాంగ్ చేతిలో ఓడిపోయింది. ఇదే టోర్నీలో మేరీకోమ్ (48 కేజీలు), ప్రియాంక చౌదరీ (60 కేజీలు), శిక్ష (54 కేజీలు) కూడా సెమీఫైనల్లోకి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment