ఆ ఫొటో పొరపాటున పెట్టా! | Serena Williams discusses leaking news of pregnancy, return to tennis | Sakshi
Sakshi News home page

ఆ ఫొటో పొరపాటున పెట్టా!

Published Wed, Apr 26 2017 10:33 PM | Last Updated on Tue, Sep 5 2017 9:46 AM

ఆ ఫొటో పొరపాటున పెట్టా!

ఆ ఫొటో పొరపాటున పెట్టా!

మళ్లీ బరిలోకి దిగుతానంటున్న సెరెనా

వాంకోవర్‌:  తాను గర్భవతిననే విషయాన్ని కొంత మంది సన్నిహితులతోనే పంచుకున్నానని, చిన్న పొరపాటు కారణంగా సోషల్‌ మీడియాలో ఆ ఫోటో చేరిపోయిందని వరల్డ్‌ నంబర్‌వన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ వెల్లడించింది. రెడ్‌ఇట్‌ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహానియన్‌తో గత డిసెంబర్‌లో సెరెనాకు నిశ్చితార్థం జరగ్గా... తాను తల్లి కాబోతున్నట్లు ఆమె ఇటీవలే ప్రకటించింది. ‘ప్రెగ్నెన్సీ ఖరారైనప్పటినుంచి రికార్డు కోసం ప్రతీ వారం ఒక ఫోటో తీయడాన్ని అలవాటుగా మార్చుకున్నాను.

అయితే స్విమ్‌సూట్‌లో ఉన్న ఫోటో పొరపాటున పోస్ట్‌ చేసేశాను. సోషల్‌ మీడియా ఇప్పుడు ఎలా ఉందో తెలుసు కదా. ఒక బటన్‌ నొక్కామంటే చాలు అంతా చేజారిపోయినట్లే’ అని సెరెనా చెప్పింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రారంభానికి కేవలం రెండు రోజుల ముందు తన తల్లి కాబోతున్నట్లు తెలిసిందని, బరిలోకి దిగే ముందు బిడ్డకేమైనా ప్రమాదం జరుగుతుందా అని ఎంతో ఆలోచించినట్లు సెరెనా వెల్లడించింది.  బిడ్డ పుట్టిన తర్వాత తాను తిరిగి కోర్టులోకి అడుగు పెడతానని సెరెనా స్పష్టం చేసింది. ‘కచ్చితంగా మళ్లీ వస్తాను. స్టాండ్స్‌లోకి కూర్చొని నా బిడ్డ నన్ను ఉత్సాహపరచాలని కోరుకుంటున్నా. ఎక్కువగా ఏడవకుండా ఉంటే మరీ మంచిది’ అని సెరెనా నవ్వుతూ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement