జొకోవిచ్ శుభారంభం | Serena Williams, Novak Djokovic advance at Wimbledon | Sakshi
Sakshi News home page

జొకోవిచ్ శుభారంభం

Published Mon, Jun 29 2015 11:44 PM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM

జొకోవిచ్ శుభారంభం

జొకోవిచ్ శుభారంభం

 సెరెనా, షరపోవా కూడా  వింబుల్డన్ టోర్నమెంట్
 లండన్: డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ 6-4, 6-4, 6-4తో కోల్‌ష్రైబర్ (జర్మనీ)పై విజయం సాధించాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 12 ఏస్‌లు సంధించడంతోపాటు, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ నిషికోరి (జపాన్) 6-3, 6-7 (4/7), 6-2, 3-6, 6-3తో బొలెలీ (ఇటలీ)పై, ఏడో సీడ్ రావ్‌నిక్ (కెనడా) 6-2, 6-3, 3-6, 7-6 (7/4)తో ట్రెవర్ (స్పెయిన్)పై, తొమ్మిదో సీడ్  సిలిచ్ (క్రొయేషియా) 6-3, 6-2, 7-6 (7/4)తో మొరియా (జపాన్)పై, 26వ సీడ్ కిరియోస్ (ఆస్ట్రేలియా) 6-0, 6-2, 7-6 (8/6)తో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)పై గెలుపొందారు.చివరిసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతోన్న మాజీ చాంపియన్ లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా) 6-3, 3-6, 6-4, 0-6, 9-11తో నిమినెన్ (ఫిన్‌లాండ్) చేతిలో ఓడిపోయి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు.
 
  మహిళల సింగిల్స్ విభాగంలోనూ సీడెడ్ క్రీడాకారిణులు అలవోక విజయాలతో రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 6-4, 6-1తో మార్గరీటా గ్యాస్‌పర్యాన్ (రష్యా)పై, నాలుగో సీడ్ షరపోవా (రష్యా) 6-2, 6-2తో జోనా కోంటా (బ్రిటన్)పై, ఏడో సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా) 6-1, 6-1తో యి ఫాన్ జు (చైనా)పై, 16వ సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 6-0, 6-0తో మాడిసన్ బ్రింగిల్ (అమెరికా)పై విజయం సాధించారు. రెండో రౌండ్‌లో బోపన్న జంట: పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో బోపన్న-మెర్జియా 6-3, 6-7 (1/7), 6-1తో టిమ్ స్మిజెక్ (అమెరికా)-జిరీ వెస్లె (చెక్ రిపబ్లిక్)లపై గెలిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement