ఫ్రెంచ్ ఓపెన్ విజేత సెరెనా | serena williams wins french open title | Sakshi
Sakshi News home page

ఫ్రెంచ్ ఓపెన్ విజేత సెరెనా

Published Sat, Jun 6 2015 8:47 PM | Last Updated on Wed, Sep 18 2019 2:58 PM

ఫ్రెంచ్ ఓపెన్ విజేత సెరెనా - Sakshi

ఫ్రెంచ్ ఓపెన్ విజేత సెరెనా

పారిస్: అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్.. ఫ్రెంచ్ ఓపెన్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించాలన్న లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) ఆశలు ఆవిరయ్యాయి.

 

శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సెరెనా.. 6-3, 6-7, 6-2 స్కోరుతో సఫరోవాపై విజయం సాధించింది. తొలి సెట్ ను అవలీలగా గెలిచిన సెరెనా.. అనవసర తప్పిదాలతో రెండో సెట్ ను  కోల్పోయింది.  అయితే నిర్ణయాత్మకమైన మూడో గేమ్ లో మాత్రం సెరెనాను సఫరోవా నియంత్రించేందుకు గట్టిగా యత్నించింది.  ఓ దశలో సెరెనా సర్వీస్ ను బ్రేక్ చేసి కాస్త ముందంజంలో కనిపించింది.  కాగా, సెరెనా తన అనుభవాన్ని ఉపయోగించి మూడో గేమ్ ను కైవసం చేసుకుని ట్రోఫీని చేజిక్కించుకుంది. దీంతో సెరెనా కెరీర్లో 20వ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ ను సాధించినట్లయ్యింది. వ్యక్తిగతంగా సఫరోవాపై సెరెనాకు 9వ విజయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement