ముంబై: ఆసక్తికరంగా సాగుతున్న టెస్టు సిరీస్‌కు రివ్యూ వివాదం కారణంగా చెడ్డ పేరు రాకూడదనే తాము ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు బీసీసీఐ పరిపాలనా కమిటీ (సీఓఏ) సభ్యురాలు డయానా ఎడుల్జీ వెల్లడించారు. ‘రివ్యూ అంశంపై బోర్డు సీఈఓ జోహ్రి, కోచ్ కుంబ్లేలతో సీఓఏ తీవ్రంగా చర్చించింది. మేం సిరీస్ సజావుగా సాగాలని కోరుకున్నాం. ఇలాంటి వివాదం ఆటకు మంచిది కాదని భావించాం. అందుకే దానిని మరింత సాగదీయకుండా ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాం.
అదే విధంగా భారత కెప్టెన్‌కు బోర్డు అండగా నిలవలేదని ఎవరూ భావించకుండా మేం కోహ్లికి మద్దతుగా ప్రకటన విడుదల చేశాం’ అని ఎడుల్జీ వెల్లడించారు. మరోవైపు ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈ సదర్లాండ్ చేసిన విజ్ఞప్తి మేరకే భారత్ వెనక్కి తగ్గినట్లు సమాచారం.
‘వివాదాన్ని సాగదీయదల్చుకోలేదు’
Published Sat, Mar 11 2017 12:48 AM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM
Advertisement
Advertisement