క్రికెట్‌ చాలు.. యాక్టింగ్‌ వదిలేయండి | Shah Rukh Khan Reply To KKR Players Leave Acting To Me | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ చాలు.. యాక్టింగ్‌ వదిలేయండి

Published Thu, May 17 2018 1:45 PM | Last Updated on Mon, Dec 21 2020 1:11 PM

Shah Rukh Khan Reply To KKR Players Leave Acting To Me - Sakshi

కేకేఆర్‌ జట్టు సహ యజమాని షారుఖ్‌ ఖాన్‌ (ఫైల్‌ ఫొటో)

ఐపీఎల్‌ మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మంగళవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపొంది ప్లేఆఫ్‌ దిశగా అడుగులు వేసిన విషయం తెలిసిందే. అయితే ఆటతోనే కాకుండా.. తమ నటనా ప్రతిభతో కూడా తమ జట్టు సహ యజమాని షారుఖ్‌ను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కేకేఆర్‌ ఆటగాళ్లు.  క్రిస్‌ లిన్‌, సునిల్‌ నరైన్‌, కుల్దీప్‌ యాదవ్‌, పీయూష్‌ చావ్లాలతో పాటు కెప్టెన్‌ దినేశ్‌ కార్తిక్‌.. షారుఖ్‌ ఖాన్‌ సినిమాల్లోని ఫేమస్‌ డైలాగులు చెప్పేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోను షారుఖ్‌ సొంత నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్టైన్‌మెంట్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

‘వాళ్లు ఇంతవరకు మైదానంలో చేసిన ప్రదర్శనే మీరు చూసి ఉంటారు.. ఇప్పుడు వారి రాకింగ్‌ పెర్ఫామెన్స్‌ చూడండి అంటూ ఆర్‌సీఈ ట్వీట్‌ చేసింది. అయితే షారూఖ్‌ను అనుకరించేందుకు ఆటగాళ్లు చేసిన ప్రయత్నం నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియోను వీక్షించిన షారుఖ్‌.. ‘నా జట్టును ఎంతో ప్రేమిస్తాను. అయితే నేను మీకు క్రికెట్‌ను వదిలేశాను కదా.. యాక్టింగ్‌ నా కోసం వదిలేయండి అంటూ’  కేకేఆర్‌ ఆటగాళ్లను ఉద్దేశించి సరదాగా ట్వీట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement