పాక్‌ విజయం | Shah the star as Pakistan rout West Indies | Sakshi
Sakshi News home page

పాక్‌ విజయం

Published Wed, Apr 26 2017 12:43 AM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM

పాక్‌ విజయం

పాక్‌ విజయం

కింగ్‌స్టన్‌: వెస్టిండీస్‌తో జరిగిన తొలిటెస్టులో పాకిస్తాన్‌ 7 వికెట్ల తేడాతో గెలిచింది. మూడు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. చివరి రోజు 93/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో మంగళవారం ఆట ప్రారంభించిన వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 152 పరుగుల వద్ద ఆలౌటైంది. చేజ్‌ 16, హోల్డర్‌ 14 పరుగులు చేశారు.

పాక్‌ స్పిన్నర్‌ యాసిర్‌ షా (6/63), పేసర్‌ అబ్బాస్‌ (2/35) విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. అనంతరం 32 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ 3 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసి గెలిచింది. ఈ నెల 30 నుంచి బ్రిడ్జ్‌టౌన్‌లో రెండో టెస్టు జరుగనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement