కోహ్లికి పాక్‌ స్టార్‌ క్రికెటర్‌ కితాబు | Shahid Afridi Thanks Virat Kohli, Team India For Farewell Gift | Sakshi
Sakshi News home page

కోహ్లికి పాక్‌ స్టార్‌ క్రికెటర్‌ కితాబు

Published Sat, Apr 22 2017 12:46 PM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM

కోహ్లికి పాక్‌ స్టార్‌ క్రికెటర్‌ కితాబు

కోహ్లికి పాక్‌ స్టార్‌ క్రికెటర్‌ కితాబు

కరాచీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తనకు అపురూపమైన వీడ్కోలు బహుమతి ఇచ్చినందుకు పాకిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది ధన్యవాదాలు తెలిపాడు. కోహ్లి సూపర్‌ స్టార్‌ అని కితాబిచ్చాడు. అతడిని త్వరలోనే కలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నాడు. ‘అద్భుతమైన ఫేర్‌ వెల్‌ గిఫ్ట్‌ ఇచ్చినందుకు విరాట్‌ కోహ్లి, మొత్తం భారత క్రికెట్‌ జట్టుకు ధన్యవాదాలు. సూపర్‌ స్టార్‌ కోహ్లి అంటే నాకెంతో గౌరవం. అతడిని త్వరలోనే కలుకోవాలని అనుకుంటున్నాన’ని ఆఫ్రిది ట్వీట్‌ చేశాడు.

తనతో  పాటు ఇతర భారత క్రికెటర్ల సంతకాలతో కూడిన ‘18’ నంబర్‌ జెర్సీని ఆఫ్రిదికి కోహ్లి కానుకగా ఇచ్చాడు. కరాచీలో ఇటీవలే కొత్తగా కట్టుకున్న తన ఇంట్లో దీన్ని ఆఫ్రిది పదిలపర్చుకున్నాడు. ఫ్రేమ్‌ కట్టించి ఇంట్లో పెట్టుకున్నాడు. దీనిని కానుకగా ఇస్తూ కోహ్లి.. ‘షాహిద్‌ భాయ్, అభినందనలు. మైదానంలో నీతో తలపడటం ఎప్పుడైనా ప్రత్యేకమే’ అంటూ వ్యాఖ్య రాశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement