జోహెన్నెస్‌బర్గ్:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో భారత బౌలర్లు దూకుడుగా బౌలింగ్ చేస్తున్నారు. 241 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సఫారీలకు చుక్కలు చూపెడుతున్నారు. 157 పరుగులకే ఏడు దక్షిణాఫ్రికా వికెట్లు నేలకూల్చి మ్యాచ్‌పై పట్టుబిగించారు. శనివారం నాల్గో రోజు ఆటలో భాగంగా 17/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా లంచ్ సమయం వరకూ నిలకడగా బ్యాటింగ్ చేసింది. ఓవర్‌నైట్ ఆటగాళ్లు డీన్ ఎల్గర్, హషీమ్ ఆమ్లాలు బాధ్యతాయుతంగా ఆడి స్కోరును ముందుకు తీసుకెళ్లారు.
ఈ జోడి 119 పరుగుల భాగస్వామ‍్యాన్ని జతచేసి సునాయాస విజయానికి బాటలు వేసుకునే యత్నం చేశారు. అయితే 124 పరుగుల వద్ద ఆమ్లా(52) రెండో వికెట్‌గా అవుటైన తరువాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆపై డివిలియర్స్(6), డు ప్లెసిస్(2), డీ కాక్(0), ఫిలాండర్(10),పెహ్లకోవాయా(0)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ప్రధానంగా 33 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు సాధించడంతో భారత్‌దే పైచేయిగా నిలిచింది. సఫారీలు భారత్ సాధించిన ఏడు వికెట్లలో షమీ మూడు వికెట్లు సాధించగా, బూమ్రా, ఇషాంత్ శర్మలు తలో రెండు వికెట్లు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment