‘వార్నీ’ మరో ప్రేమాయణం
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్‌వార్న్ మళ్లీ ప్రేమలో పడ్డాడు. ఆస్ట్రేలియాకే చెందిన ప్లేబాయ్ మోడల్ ఎమిలీ స్కాట్‌తో కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని వార్న్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
గత నెలలో స్కాట్‌ను ముద్దాడుతూ అడ్డంగా బుక్కయిన వార్న్ ఈ వ్యవహారంపై కొద్ది కాలంగా మౌనంగా ఉన్నా.. చివరికి అంగీకరించాల్సి వచ్చింది. 2005లో భార్య సిమోన్‌కు విడాకులిచ్చిన తర్వాత వార్న్ బ్రిటిష్ మోడల్ లిజ్ హార్లీతో ప్రేమాయణం నడిపాడు. ఇద్దరు కలిసి మూడేళ్ల పాటు సహజీవనం కూడా చేశారు.