'రవిశాస్త్రి రోల్ అమోఘం' | Shastri has been terrific as team director, says Dravid | Sakshi
Sakshi News home page

'రవిశాస్త్రి రోల్ అమోఘం'

Published Fri, Jun 12 2015 3:49 PM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM

'రవిశాస్త్రి రోల్ అమోఘం'

'రవిశాస్త్రి రోల్ అమోఘం'

న్యూఢిల్లీ: టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రిపై మాజీ ఆటగాడు  రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా డైరెక్టర్ గా రవిశాస్త్రి పాత్ర అమోఘమని కొనియాడాడు. ప్రస్తుతం జట్టు డైరెక్టర్ గా రవిశాస్త్రికి తాత్కాలిక బాధ్యతలు అప్పజెప్పిన బీసీసీఐ.. పూర్తి స్థాయి బాధ్యతలను అప్పచెబితే బాగుంటుందన్నాడు. కాగా, వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ నిష్క్రమణపై మాత్రం రాహుల్ ఏ విధమైన స్పందనా తెలియజేయలేదు.

 

' ఆ ఓటమిపై మీడియాలో వచ్చిన వార్తలపై మాట్లాడదలుచుకోలేదు. అయితే వరల్డ్ కప్ లో టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి పాత్ర మాత్రం నిజంగా వెలకట్టలేనిది.  అతని అనుభవం జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు' అని రాహుల్ తెలిపాడు. ఇటీవల రాహుల్ ద్రవిడ్ ఇండియా -ఎ , అండర్ -19 జట్టులకు కోచ్ గా ఎంపికయ్యాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement