
ధావన్@ 400
టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ తాజా వన్డే వరల్డ్ కప్ పరుగుల వీరుల జాబితాలో మళ్లీ టాప్-5లోకి వచ్చాడు.
సిడ్నీ: టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ తాజా వన్డే వరల్డ్ కప్ పరుగుల వీరుల జాబితాలో మళ్లీ టాప్-5లోకి వచ్చాడు. 400 పరుగులు పూర్తి చేసి టాప్ బ్యాట్స్ మెన్ లిస్టులో చోటు సంపాదించాడు.
412 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ప్రపంచకప్ లో ధావన్ 2 సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో ధావన్ 45 పరుగులు చేసి అవుటయ్యాడు. ఒకే వరల్డ్ కప్ లో 400 పైచిలుకు పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో ధావన్ నాలుగోవాడు. సచిన్, గంగూలీ, ద్రవిడ్ అతడి కంటే ముందు ఈ ఘనత సాధించారు.