రెండోరౌండ్‌లో శివాని, రిషిక | shivani, rishika enter second round | Sakshi
Sakshi News home page

రెండోరౌండ్‌లో శివాని, రిషిక

Published Tue, Nov 22 2016 10:55 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM

shivani, rishika enter second round

సాక్షి, హైదరాబాద్: ఆసియా టెన్నిస్ టూర్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్‌లో అమినేని శివాని, సుంకర రిషిక శుభారంభం చేశారు. తెలంగాణ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో శాట్స్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో సోమవారం జరిగిన మహిళల తొలిరౌండ్‌లో శివాని 6-3, 6-2తో మౌళిక రామ్‌పై గెలుపొందగా... సుంకర రిషిక 6-1, 6-1తో శ్వేతను ఓడించి రెండోరౌండ్‌లోకి ప్రవేశించారు. ఇతర మ్యాచ్‌ల్లో సౌజన్య భవిశెట్టి 6-0, 6-0తో అమ్రిత ముఖర్జీపై, సింధు జనగాం 6-0, 6-0తో గుల్స్ ్రబేగంపై, సంహిత 6-2, 6-3తో శ్రీయపై, భువన 6-2, 6-1తో హర్షితపై, లలిత 6-3, 6-3తో శ్రీ సాయి శివానిపై, నిధి 6-4, 6-4 తీర్థపై విజయం సాధించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement