శుభం కొత్త చరిత్ర | shubham jaglan new history | Sakshi
Sakshi News home page

శుభం కొత్త చరిత్ర

Published Sat, Jul 25 2015 1:04 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM

shubham jaglan new history

వరుసగా 2 టైటిల్స్ నెగ్గిన భారత కుర్రాడు
న్యూఢిల్లీ:
ఐజేజీఏ వరల్డ్ స్టార్స్ జూనియర్ గోల్ఫ్ ఈవెంట్‌లో భారత కుర్రాడు శుభం జగ్లాన్ కొత్త చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండు జూనియర్ టైటిల్స్ నెగ్గి రికార్డులకెక్కాడు. లాస్ వెగాస్‌లో జరిగిన బాలుర 9-10 కేటగిరీలో పదేళ్ల శుభం... మూడు రౌండ్లలో ఐదు స్ట్రోక్‌లతో 106 స్కోరు చేసి టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. అమెరికాకు చెందిన జస్టిన్ డాంగ్, సిహాన్ సంధు, పోంగ్‌స్పార్క్ లియోపాక్‌డీ (పోలెండ్) శుభంకు గట్టిపోటీ  ఇచ్చారు. గత ఆదివారం కాలిఫోర్నియాలో జరిగిన జూనియర్ వరల్డ్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో శుభం టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.  శుభం తండ్రి హరియాణాలోని ఓ గ్రామంలో పాలు అమ్ముతుంటాడు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement