పాలబ్బాయి కొడుకు.. వరల్డ్ చాంపియన్! | Milkman's son Shubham Jaglan lifts world junior golf title | Sakshi
Sakshi News home page

పాలబ్బాయి కొడుకు.. వరల్డ్ చాంపియన్!

Published Sun, Jul 19 2015 4:57 PM | Last Updated on Sun, Sep 3 2017 5:48 AM

పాలబ్బాయి కొడుకు.. వరల్డ్ చాంపియన్!

పాలబ్బాయి కొడుకు.. వరల్డ్ చాంపియన్!

న్యూఢిల్లీ: శుభమ్ జగ్లాన్.. భారత్ కు చెందిన ఈ కుర్రాడు గత మూడు సంవత్సరాల క్రితం వరకూ ప్రపంచానికి తెలియదు. అయితే భారత మాజీ టాప్ గోల్ఫర్ నోనితా లాల్ ఖరేషి అతనిలోని ప్రతిభను గుర్తించింది. చిన్నారుల విభాగంలో జరిగిన ప్రతీ చిన్న గోల్ఫ్ టోర్నమెంట్ కు ఆ కుర్రాడి పేరును ఆమె సిఫార్సు చేస్తూ ఉండేది. ప్రస్తుతం ఆ యువకుడే వరల్డ్ చాంపియన్ గా నిలిచాడు. ఏమాత్రం పరిచయం లేని ఆ బుడతడు వరల్డ్ జూనియర్ గోల్ఫ్ చాంపియన్‌ గా అవతరించి యావత్తు భారత్ జాతిని తనవైపుకు తిప్పుకున్నాడు. ఇంతకీ ఇదంతా సాధించింది ఒక పాలబ్బాయి కొడుకు.


శుభమ్ జగ్లాన్ ది హర్యానా రాష్ట్రంలోని పానిప్పా జిల్లా ఇస్రానా గ్రామం. నిరక్ష్యరాస్యుడైన ఓ పాల వ్యాపారి కొడుకు. ఈ కుర్రాడికి చిన్నప్పట్నుంచి గోల్ఫ్ పై ఆసక్తి ఎక్కువ. దానిలో భాగంగానే పొలంలోనే తన ప్రాక్టీస్ ను కొనసాగించేవాడు. దీంతో పాటుగా ఇసుకలో కూడా ఎక్కువగా సాధన చేసేవాడు. దీనికి సంబంధించిన కొన్ని చిట్కాలను యూ ట్యూబ్ ద్వారా నిపుణుల సలహాలు తీసుకుంటూ తన ఇష్టాన్ని, కలను సాధించే దిశగా సాగిపోయాడు. ఆ క్రమంలోనే గత సంవత్సరం రన్నరప్‌గా నిలిచిన శుభమ్ ఈసారి చాంపియన్‌గా అవతరించాడు.
 

9-10 మధ్య వయస్సు కేటగిరీలో గురువారం అమెరికాలోని శాండిగోలోఐఎంజీ అకాడమీ నిర్వహించిన ప్రపంచ జూనియర్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో శుభమ్ జగ్లాన్ చాంపియన్ గా అవతరించి సంచలనం సృష్టించాడు. ఇప్పటికే వంద టోర్నమెంట్లలో విజయాలను సొంతం చేసుకున్న శుభమ్ మరిన్ని విజయాలను సాధించి దేశ కీర్తిని మరింత ఇనుమడింప జేస్తాడని ఆశిద్దాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement