దుబాయ్ : టెస్టు హోదా దక్కించుకోవాలనే అసోసియేట్ దేశాల కల తొందర్లోనే తీరే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు 2015-17 ఐసీసీ ఇంటర్ కాంటినెంటల్ కప్ వేదిక కానుంది. రౌండ్ రాబిన్ లీగ్‌లో జరిగే ఈ కప్‌లో నెగ్గిన విజేత 2018లో జరిగే ఐసీసీ టెస్టు చాలెంజ్‌లో... ఆఖరి ర్యాంకులో ఉండే టెస్టు జట్టుతో తలపడుతుంది. దీంట్లో భాగంగా వీటి మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో నెగ్గిన అసోసియేట్ జట్టుకు టెస్టు హోదా దక్కుతుంది.
ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో అఫ్ఘానిస్తాన్, హాంగ్‌కాంగ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్, యూఏఈ జట్లు ఆడనున్నాయి. ఈనెల 10 నుంచి 13 వరకు నమీబియా, హాంగ్‌కాంగ్ జట్ల మధ్య నాలుగు రోజుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌తో ఈ కప్ ఆరంభం కానుంది. 2004లో తొలి ఇంటర్ కాంటినెంటల్ కప్‌ను స్కాట్లాండ్ గెలుచుకోగా నాలుగు సార్లు (2005, 06-07, 07-08, 11-13) ఐర్లాండ్, 2009-10లో అఫ్ఘాన్ విజేతగా నిలిచింది.
చిన్న దేశాలకూ టెస్టు అవకాశం
Published Wed, May 6 2015 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM
Advertisement
Advertisement