అజ్మీర్: నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించారు. ఆదివారం ముగిసిన జాతీయ క్యాడెట్, సబ్ జూనియర్ పోటీల్లో సబ్ జూనియర్ బాలుర సింగిల్స్ విభాగంలో ఫిడేల్ రఫీక్ స్నేహిత్, వి.ఎస్.హరికృష్ణ... క్యాడెట్ బాలికల సింగిల్స్ విభాగంలో ఆయుషి ఘియా కాంస్య పతకాలు సాధించారు. ఈ ముగ్గురూ సెమీఫైనల్స్‌లో ఓడిపోయారు. సబ్ జూనియర్ బాలికల డబుల్స్ విభాగంలో నైనా జైస్వాల్-శైలూ నూర్ బాషా జోడి రజత పతకాన్ని దక్కించుకుంది. 2003లో శుభమ్ శర్మ తర్వాత సబ్ జూనియర్ బాలుర సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు పతకాలు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
బాలికల డబుల్స్ ఫైనల్లో నైనా-శైలూ ద్వయం 4-11, 9-11, 10-12తో యశిని-దీప్తి (తమిళనాడు) జంట చేతిలో ఓటమిపాలైంది. సబ్ జూనియర్ బాలుర సెమీఫైనల్స్‌లో స్నేహిత్ 2-4 (12-10, 6-11, 6-11, 12-10, 7-11, 4-11)తో భారత రెండో ర్యాంకర్ ఆకాశ్ నాథ్ (బెంగాల్) చేతిలో; హరికృష్ణ 1-4 (10-12, 7-11, 11-9, 8-11, 7-11)తో భారత నంబర్‌వన్ మానవ్ ఠక్కర్ (పీఎస్‌పీబీ) చేతిలో ఓటమి చవిచూశారు. క్యాడెట్ బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో ఆయుషి 1-3 (12-10, 9-11, 6-11, 11-13)తో స్వస్తిక ఘోష్ (మహారాష్ట్ర) చేతిలో పరాజయం పాలైంది.
స్నేహిత్, హరి, ఆయుషిలకు కాంస్యాలు
Published Mon, Dec 30 2013 1:39 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement