సనమ్ సింగ్ సంచలనం | sonam singh | Sakshi
Sakshi News home page

సనమ్ సింగ్ సంచలనం

Published Fri, Feb 20 2015 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

sonam singh

టాప్ సీడ్ జేమ్స్ డక్‌వర్త్‌పై గెలుపు
 ఢిల్లీ ఓపెన్ క్వార్టర్స్‌లో ప్రవేశం

 
 న్యూఢిల్లీ: భారత యువ టెన్నిస్ ఆటగాడు సనమ్ సింగ్ ఢిల్లీ ఓపెన్‌లో సంచలన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ సాధించిన తను గురువారం ఆర్‌కే ఖన్నా టెన్నిస్ స్టేడియంలో జరిగిన సింగిల్స్ రెండో రౌండ్‌లో టాప్ సీడ్ జేమ్స్ డక్‌వర్త్‌ను కంగుతినిపించాడు. అలాగే తనతోపాటు యూకీ బాంబ్రీ, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ కూడా క్వార్టర్స్ బెర్త్ దక్కించుకున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 464వ స్థానంలో ఉన్న సనమ్ 3-6, 7-5, 6-3తో ఆసీస్‌కు చెందిన టాప్ సీడ్ జేమ్స్‌పై నెగ్గాడు.
 
 గత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరిన 112వ ర్యాంకర్ జేమ్స్‌పై తొలి సెట్‌లో ఇబ్బంది పడినా ఆ తర్వాత సనమ్ అద్భుత ఆటతీరును కనబరిచాడు. క్వార్టర్స్‌లో తను సోమ్‌దేవ్‌తో తలపడనున్నాడు. ఇక యూకీ బాంబ్రీ 6-3, 6-3తో ఎగర్ గెరాసిమోవ్ (బెలారస్)పై నెగ్గగా... సోమ్‌దేవ్ 6-4, 6-2తో నికోలా మెక్టిక్ (క్రొయేషియా)పై గెలిచాడు. సాకేత్‌తో కలిపి నలుగురు భారత ఆటగాళ్లు ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరారు. డబుల్స్‌లో ఎన్.శ్రీరామ్ బాలాజీ, విష్ణువర్ధన్ జోడి 6-1, 6-1తో డినో మార్కాన్, ఆంటోనియో సాన్‌కిక్ (క్రొయేషియా)ను ఓడించి సెమీస్‌కు చేరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement