Delhi Open
-
రన్నరప్ నికీ పునాచా జోడీ
న్యూఢిల్లీ: ఏటీపీ చాలెంజర్ 75 టోర్నీ ఢిల్లీ ఓపెన్‌లో భారత టెన్నిస్ ఆటగాడు నికీ పునాచా రన్నరప్‌గా నిలిచాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన నికీ పునాచా–కోర్ట్నీ జాన్ లాక్ (జింబాబ్వే) జంట చేతిలో ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. శనివారం జరిగిన తుదిపోరులో అన్‌సీడెడ్ మసమిచి ఇమామురా–రియో నొగుచి (జపాన్) ద్వయం 6–4, 6–3తో నికీ–జాన్ లాక్ జోడీపై విజయం సాధించింది. తొలి సెట్ ఆరంభం నుంచే విజృంభించిన జపాన్ జోడీ... 4–1తో ముందంజ వేసింది. ఈ దశలో పుంజుకున్న పునాచా జంట 3–4తో ఆధిక్యాన్ని తగ్గించగలిగిందే తప్ప... చివరి వరకు అదే జోరు కొనసాగించలేక తొలి సెట్ కోల్పోయింది. రెండో సెట్లోనూ రాణించిన జపాన్ ద్వయం సునాయాసంగా సెట్‌తో పాటు టైటిల్ గెలుచుకుంది.మరో వైపు సింగిల్స్ విభాగంలో కైరియాన్ జాక్వెట్ (ఫ్రాన్స్), బిల్లీ హారిస్ (బ్రిటన్) ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి సెమీస్‌లో జాక్వెట్ 6–3, 6–1తో విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)పై...రెండో సెమీస్‌లో హారిస్ 4–6, 7–6 (7/4), 6–2తో ట్రిస్టన్ స్కూల్‌కేట్ (ఆ్రస్టేలియా)పై గెలుపొందారు. -
సెమీస్‌లో సోమ్‌దేవ్, యుకీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్‌లో భారత యువ టెన్నిస్ ఆటగాళ్లు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, యుకీ భాంబ్రీ సెమీస్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో సోమ్‌దేవ్ 4-6 6-1 6-3 స్కోరుతో సనమ్ సింగ్‌పై పోరాడి గెలిచాడు. మరో మ్యాచ్‌లో యుకీ 7-6 (3) 6-3తో రడు ఆల్బట్పై విజయం సాధించాడు. -
సనమ్ సింగ్ సంచలనం
టాప్ సీడ్ జేమ్స్ డక్‌వర్త్‌పై గెలుపు ఢిల్లీ ఓపెన్ క్వార్టర్స్‌లో ప్రవేశం న్యూఢిల్లీ: భారత యువ టెన్నిస్ ఆటగాడు సనమ్ సింగ్ ఢిల్లీ ఓపెన్‌లో సంచలన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ సాధించిన తను గురువారం ఆర్కే ఖన్నా టెన్నిస్ స్టేడియంలో జరిగిన సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ జేమ్స్ డక్‌వర్త్‌ను కంగుతినిపించాడు. అలాగే తనతోపాటు యూకీ బాంబ్రీ, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ కూడా క్వార్టర్స్ బెర్త్ దక్కించుకున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 464వ స్థానంలో ఉన్న సనమ్ 3-6, 7-5, 6-3తో ఆసీస్‌కు చెందిన టాప్ సీడ్ జేమ్స్‌పై నెగ్గాడు. గత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరిన 112వ ర్యాంకర్ జేమ్స్‌పై తొలి సెట్లో ఇబ్బంది పడినా ఆ తర్వాత సనమ్ అద్భుత ఆటతీరును కనబరిచాడు. క్వార్టర్స్‌లో తను సోమ్‌దేవ్‌తో తలపడనున్నాడు. ఇక యూకీ బాంబ్రీ 6-3, 6-3తో ఎగర్ గెరాసిమోవ్ (బెలారస్)పై నెగ్గగా... సోమ్‌దేవ్ 6-4, 6-2తో నికోలా మెక్టిక్ (క్రొయేషియా)పై గెలిచాడు. సాకేత్‌తో కలిపి నలుగురు భారత ఆటగాళ్లు ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరారు. డబుల్స్‌లో ఎన్.శ్రీరామ్ బాలాజీ, విష్ణువర్ధన్ జోడి 6-1, 6-1తో డినో మార్కాన్, ఆంటోనియో సాన్‌కిక్ (క్రొయేషియా)ను ఓడించి సెమీస్‌కు చేరింది. -
యుకీ, సోమ్దేశ్ శుభారంభం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్‌లో భారత టెన్నిస్ ఆటగాళ్లు యుకీ భాంబ్రీ, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో యుకీ 7-5 7-6(2)తో అలెగ్జాండర్ కుడ్రెవ్సెవ్ (రష్యా)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో సోమ్‌దేవ్ 4-6, 2-0 స్కోరుతో ఉన్న దశలో ప్రత్యర్థి అంటోనియో వీక్ (క్రొయేషియా) గాయం కారణంగా వైదొలిగాడు. భారత ఆటగాళ్లు సనమ్ సింగ్, రామ్‌కుమార్ రామనాథన్ కూడా టోర్నీలో ముందంజ వేశారు.