sonam singh
-
సనమ్ సింగ్ సంచలనం
టాప్ సీడ్ జేమ్స్ డక్‌వర్త్‌పై గెలుపు ఢిల్లీ ఓపెన్ క్వార్టర్స్‌లో ప్రవేశం న్యూఢిల్లీ: భారత యువ టెన్నిస్ ఆటగాడు సనమ్ సింగ్ ఢిల్లీ ఓపెన్‌లో సంచలన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ సాధించిన తను గురువారం ఆర్కే ఖన్నా టెన్నిస్ స్టేడియంలో జరిగిన సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ జేమ్స్ డక్‌వర్త్‌ను కంగుతినిపించాడు. అలాగే తనతోపాటు యూకీ బాంబ్రీ, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ కూడా క్వార్టర్స్ బెర్త్ దక్కించుకున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 464వ స్థానంలో ఉన్న సనమ్ 3-6, 7-5, 6-3తో ఆసీస్‌కు చెందిన టాప్ సీడ్ జేమ్స్‌పై నెగ్గాడు. గత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరిన 112వ ర్యాంకర్ జేమ్స్‌పై తొలి సెట్లో ఇబ్బంది పడినా ఆ తర్వాత సనమ్ అద్భుత ఆటతీరును కనబరిచాడు. క్వార్టర్స్‌లో తను సోమ్‌దేవ్‌తో తలపడనున్నాడు. ఇక యూకీ బాంబ్రీ 6-3, 6-3తో ఎగర్ గెరాసిమోవ్ (బెలారస్)పై నెగ్గగా... సోమ్‌దేవ్ 6-4, 6-2తో నికోలా మెక్టిక్ (క్రొయేషియా)పై గెలిచాడు. సాకేత్‌తో కలిపి నలుగురు భారత ఆటగాళ్లు ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరారు. డబుల్స్‌లో ఎన్.శ్రీరామ్ బాలాజీ, విష్ణువర్ధన్ జోడి 6-1, 6-1తో డినో మార్కాన్, ఆంటోనియో సాన్‌కిక్ (క్రొయేషియా)ను ఓడించి సెమీస్‌కు చేరింది. -
సాకేత్ జోడికి డబుల్స్ టైటిల్
ఐటీఎఫ్ టోర్నమెంట్ భీమవరం, న్యూస్‌లైన్: టాప్ సీడింగ్ హోదాకు న్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ మైనేని తన భాగస్వామి సనమ్ సింగ్ (భారత్)తో కలిసి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నీ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్లో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సాకేత్-సనమ్ సింగ్ ద్వయం 7-6 (7/5), 6-3తో రెండో సీడ్ శ్రీరామ్ బాలాజీ-రంజిత్ విరాళీ మురుగేశన్ (భారత్) జోడిని ఓడించింది. హోరాహోరీగా సాగిన ఈ ఫైనల్లో సాకేత్ జంట మూడు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. తొలి సెట్ టైబ్రేక్‌లో 3-5తో వెనుకబడిన దశలో సాకేత్ జంట వరుసగా ఐదు పాయింట్లు నెగ్గింది. ఓవరాల్‌గా సాకేత్ కెరీర్లో ఇది 12వ ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్ కాగా సనమ్ సింగ్‌తో కలిసి నాలుగో టైటిల్ కావడం విశేషం. కలిసి డబుల్స్ టైటిల్ నెగ్గిన సాకేత్, సనమ్ సింగ్ సింగిల్స్ విభాగం అంతిమ సమరంలో అమీతుమీ తేల్చుకోనున్నారు. సెమీఫైనల్స్‌లో సాకేత్ 6-3, 6-1తో శ్రీరామ్ బాలాజీపై నెగ్గగా... సనమ్ సింగ్ 6-3, 6-3తో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎనిమిదో సీడ్ విష్ణువర్ధన్‌ను ఓడించాడు. -
సాకేత్‌కు తొలి ఏటీపీ డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తోన్న ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని కెరీర్లో తొలి అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. కోల్‌కతాలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) ద్వయం 6-3, 3-6, 10-4తో విష్ణువర్ధన్-దివిజ్ శరణ్ (భారత్) జోడిపై గెలిచింది. 73 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సాకేత్-సనమ్ జంట మూడు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మూడుసార్లు తమ సర్వీస్‌ను కోల్పోయి, మరో మూడుసార్లు తమ ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో సాకేత్ జోడి పైచేయి సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల చైనీస్ తైపీతో జరిగిన డేవిస్ కప్ పోటీలో భారత్ తరఫున అరంగేట్రం చేసిన 26 ఏళ్ల సాకేత్‌కు కోల్‌కతా ఏటీపీ చాలెంజర్ టోర్నీలో వైల్డ్‌కార్డు ద్వారా మెయిన్ ‘డ్రా’లో చోటు లభించింది. సోమ్‌దేవ్ ఓటమి ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. మూడో సీడ్ ఎవగెని డాన్స్కాయ్ (రష్యా) 3-6, 7-5, 6-2తో సోమ్‌దేవ్‌ను ఓడించి శనివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్)తో పోరుకు సిద్ధమయ్యాడు.