విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ( సర్కిల్‌లో) (ఫైల్ ఫొటో)
సాక్షి, స్పోర్ట్స్ : ఓవర్‌సీస్‌లో అటు కెప్టెన్‌గా ఇటు బ్యాటింగ్‌తో రాణిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ కెప్టెన్ సౌరవ్‌గంగూలీ ప్రశంసల జల్లు కురిపించారు. ఓ జాతీయా చానెల్‌తో మాట్లాడుతూ.. ‘కోహ్లి పూర్తి స్థాయిలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత వెస్టిండీస్, దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ విజయాలు నమోదు చేసింది. త్వరలో పర్యటించే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో కెప్టెన్‌గా తనేంటో తెలియజేస్తాడు. నేను కెప్టెన్‌గా ధోని, రాహుల్ ద్రవిడ్‌లను చూశా. కానీ ఇలా స్థిరంగా పరుగులు చేసే కెప్టెన్‌ను ఇప్పటి వరకు చూడలేదు. కోహ్లి భారత క్రికెట్ జెండా వంటి వాడు. నేను క్రికెటర్లు అత్యద్భుత ఫామ్ కలిగిన సందర్భాలు ఎన్నో చూశా. వ్యక్తిగతంగా నాది, సచిన్, ద్రవిడ్‌లది కావొచ్చు. కానీ ఇది అలాంటిది కాదనుకుంటున్నా. ఇది ఓ జీనియస్ గొప్పతనమని భావిస్తున్నా.’ అని గంగూలీ వ్యాఖ్యానించారు.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ చాలా ముందుగానే వెళ్లాలని దాదా కోహ్లిసేనకు సూచించాడు. ఈ సిరీస్‌లకు ముందే కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడటం ద్వారా అక్కడి పరిస్థితులు తెలుస్తాయని గంగూలీ చెప్పుకొచ్చాడు. కెప్టెన్‌గా కోహ్లి ఓవర్‌సీస్‌లో భారత్‌కు టెస్ట్ సిరీస్ విజయాలను త్వరలోనే అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక కోహ్లి ఓవర్‌సీస్‌లో చేలరేగుతూ రికార్డు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఆరు వన్డేల్లో ఏకంగా 558 పరుగులు చేసి భారత్‌కు చారిత్రాత్మక విజయం అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment