న్యూఢిల్లీ : భారత స్క్వాష్ ఆటగాడు సౌరవ్ ఘోశల్ అత్యద్భుత ఆటతీరుతో చెలరేగి కొలంబియాలో జరుగుతున్న పీఎస్‌ఏ ఈవెంట్ ఫైనల్‌కు చేరాడు. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ మిగెల్ రోడ్రిగ్వెజ్‌ను 11-8, 12-10, 7-11, 4-11, 12-10 తేడాతో కంగుతినిపించాడు. తొలి రెండు గేమ్‌లు గెలిచి తర్వాతి రెండు గేమ్‌లు ఓడిన సౌరవ్ ఆఖరి గేమ్‌లో ఓటమి అంచుల్లోంచి తేరుకుని ఐదు వరుస పాయింట్లతో విజయం సాధించాడు.