Sourav ghosal
-
రన్నరప్ సౌరవ్ ఘోశల్
న్యూఢిల్లీ: పీఎస్ఏ ఈవెంట్లో అత్యద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత టాప్ స్క్వాష్ ఆటగాడు సౌరవ్ ఘోశల్ తుది పోరులో నిరాశపరిచాడు. సెమీస్‌లో టాప్ సీడ్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ అయిన మిగెల్ రోడ్రిగ్వెజ్‌ను మట్టికరిపించిన ఈ ప్రపంచ 16వ ర్యాంక్ ఆటగాడు ఫైనల్లో మాత్రం 54వ ర్యాంకర్ ఆల్ఫ్రెడో (మెక్సికో)పై పైచేయి సాధించలేకపోయాడు. ఫైనల్లో సౌరవ్ 9-11, 11-8, 4-11, 8-11 తేడాతో పరాజయం పాలయ్యాడు. -
ఫైనల్లో సౌరవ్ ఘోశల్
న్యూఢిల్లీ : భారత స్క్వాష్ ఆటగాడు సౌరవ్ ఘోశల్ అత్యద్భుత ఆటతీరుతో చెలరేగి కొలంబియాలో జరుగుతున్న పీఎస్ఏ ఈవెంట్ ఫైనల్‌కు చేరాడు. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ మిగెల్ రోడ్రిగ్వెజ్‌ను 11-8, 12-10, 7-11, 4-11, 12-10 తేడాతో కంగుతినిపించాడు. తొలి రెండు గేమ్‌లు గెలిచి తర్వాతి రెండు గేమ్‌లు ఓడిన సౌరవ్ ఆఖరి గేమ్‌లో ఓటమి అంచుల్లోంచి తేరుకుని ఐదు వరుస పాయింట్లతో విజయం సాధించాడు. -
2020 ఒలింపిక్స్‌లో స్క్వాష్: సౌరవ్ ఆశాభావం
కోల్‌కతా: ఒలింపిక్స్‌లో స్క్వాష్ క్రీడ ఏంటని అందరూ అవహేళన చేస్తున్నా... 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం ఈ ఈవెంట్ ఉంటుందని భారత స్టార్ సౌరవ్ ఘోశాల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్ కొత్త క్రీడాంశాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయన్నాడు. ఐఓసీ కొత్త అధ్యక్షుడు మరికొన్ని క్రీడాంశాలు పెంచడంపై దృష్టిపెట్టడం తమకు లాభిస్తుందన్నాడు.