
ఆ ముద్ర చెరిగేనా?
సిడ్నీ: ప్రపంచకప్ గెలిచేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ చివరి మెట్టుపై బోల్తాపడడం దక్షిణాఫ్రికా జట్టుకు అలవాటు. గతంలో జరిగిన మెగా టోర్నిల్లో ఇలాగే సఫారీ టీమ్ టైటిల్ కు దూరమైంది. తాజా ప్రపంచకప్ లో నాకౌట్ చేరిన సఫారీలు ఈ సంప్రదాయానికి ముగింపు పలుకుతారో, లేదో నేడు తేలనుంది.
ప్రపంచకప్ నాకౌట్ లో తామెన్నడూ గెలవని చరిత్రకు చరమగీతం పాడాలని డివిలియర్స్ సేన బరిలోకి దిగుతోంది. తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకతో కలబడనున్న సఫారీలు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. లంకతో జరగనున్న పోరులో విజయం సాధించి తమపై ఉన్న ముద్రను చెరిపేసుకోవాలని గట్టిపట్టుదలతో ఉంది. తొలి నాకౌట్ విజయం అందుకోవాలని తహతహలాడుతోంది.