పాక్‌తో తొలి టి20 దక్షిణాఫ్రికా గెలుపు | South Africa win over Pakistan in the first T20 | Sakshi
Sakshi News home page

పాక్‌తో తొలి టి20 దక్షిణాఫ్రికా గెలుపు

Published Fri, Nov 22 2013 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM

South Africa win over Pakistan in the first T20

జొహన్నెస్‌బర్గ్: పాకిస్థాన్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. బుధవారం అర్ధరాత్రి ముగిసిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.
 
  మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 153 పరుగులు చేసింది. డీకాక్ (33 బంతుల్లో 43; 8 ఫోర్లు), ఆమ్లా (20 బంతుల్లో 31; 6 ఫోర్లు), డు ప్లెసిస్ (22 బంతుల్లో 22; 1 ఫోర్), మిల్లర్ (11 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. జునైద్, హఫీజ్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్ 9.1 ఓవర్లలో 2 వికెట్లకు 60 పరుగులు చేసిన దశలో భారీ వర్షం పడింది. తర్వాత మ్యాచ్ సాధ్యపడలేదు. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం... పార్ స్కోరుకు పాక్ 4 పరుగులు వెనుకబడిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement