భారత్ విజయలక్ష్యం 245 | south africa women all out for 244 | Sakshi
Sakshi News home page

భారత్ విజయలక్ష్యం 245

Published Tue, Feb 21 2017 1:45 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

భారత్ విజయలక్ష్యం 245

భారత్ విజయలక్ష్యం 245

కొలంబో:మహిళల వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా ఇక్కడ భారత్ జరుగుతున్న టైటిల్ పోరులో దక్షిణాఫ్రికా 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఆది నుంచి దూకుడుగానే ఆడింది. దక్షిణాఫ్రికా ఓపెనర్లు లిజెల్లా లీ(37; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), లౌరా వొల్వార్త్త్(21; 43 బంతుల్లో 3 సిక్సర్లు) సమయోచితంగా ఆడారు.

 

ఆ తరువాత ప్రీజ్ (40), చెట్టీ(22), ట్రయాన్(23), నీకెర్క్(37), సున్ లూస్(35)లు బాధ్యతాయుతంగా ఆడటంతో దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 244 పరుగులు నమోదు చేసింది. దక్షిణాఫ్రికా మహిళలు కొన్ని విలువైన భాగస్వామ్యాలు నమోదు చేయడంతో గౌరవప్రదమైన స్కోరును సాధించకల్గింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ కు మూడు వికెట్లు లభించగా, శిఖా పాండేకు రెండు వికెట్లు దక్కాయి. పూనమ్ యాదవ్, దీప్తి శర్మలకు తలో వికెట్ లభించింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement