జోహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికా ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ సోలో నిక్వెనీ కరోనా వైరస్‌కు గురయ్యాడు. ఇప్పటికే 'గులైన్ బారే సిండ్రోమ్(జీబీఎస్)' అనే నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కాగా కొద్ది రోజలుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించడంతో నిక్వెనీ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కరోనా బారిన పడ్డ మూడో క్రికెటర్‌గా సోలో నిలిచాడు. ఇంతకు ముందు పాక్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్, స్కాట్లాండ్కు చెందిన మజిద్ హక్ కరోనాకు గురయ్యారు.(కరోనాతో మాజీ క్రికెటర్ మృతి)
So last year I got GBS, and have been battling this disease for the past 10 months and I’m only half way through my recovery. I got TB, my liver failed and my kidney failed. Now today I tested positive for corona virus. I don’t understand why all of this is happening to me.
— Solo Nicholas Nqweni (@SoloNqweni) May 7, 2020
'గతేడాది నాకు జీబీఎస్‌కు వచ్చింది. పది నెలలుగా ఈ వ్యాధితో పోరాడుతున్నా. దాదాపు సగం కోలుకున్నా. టీబీ వచ్చింది, మూత్రపిండాలు, కాలేయం పాడయ్యాయి. ఇప్పుడు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. నాకే ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు'అంటూ నిక్వెనీ ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. గతేడాది జీబీఎస్‌కు సంబంధించి చికిత్స పొందుతున్న సమయంలో కొన్ని వారాలు పాటు కోమాలో ఉన్నాడు. నిక్వెనీ 2012లో దక్షిణాఫ్రికా అండర్-19 టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కాగా నిక్వెనీ గతంలో ఈస్ట్రెన్ ప్రావిన్స్, వారియర్స్ ప్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రస్తుతం నిక్వెనీ అడేర్బీర్ షైర్ క్లబ్ తరఫున ఆడుతున్నాడు.
(ఐపీఎల్‌లో ఆ పోరు భారత్-పాక్ మ్యాచ్‌ను తలపించేలా)
Comments
Please login to add a commentAdd a comment