సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు ముందు సన్నాహకంగా తెలంగాణతో జరుగుతోన్న ఫ్రెండ్లీ కబడ్డీ టోర్నమెంట్‌లో దక్షిణ కొరియా జట్లు జోరు కనబరుస్తున్నాయి. బాచుపల్లిలోని కబడ్డీ అకాడమీలో శుక్రవారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ కొరియా జట్ల దూకుడుకు తెలంగాణ జట్లు ఓటమి పాలయ్యాయి. పురుషుల విభాగంలో తెలంగాణ 21–47తో కొరియా చేతిలో చిత్తుగా ఓడింది.
పర్యాటక జట్టులో డోగ్ గున్లీ, ఎర్న్ తే డోక్ ఆకట్టుకున్నారు. తెలంగాణ జట్టులో లింగమ్ యాదవ్, హనుమంత్ రాణించారు. మహిళల విభాగంలో కొరియా 35–25తో తెలంగాణపై నెగ్గింది. రాష్ట్ర జట్టులో పింకీ రావు, ప్రవళిక, పవిత్ర పోరాడారు.
Comments
Please login to add a commentAdd a comment