స్వ్కాష్ లో భారత్ సరికొత్త చరిత్ర
ఇంచియాన్:స్వ్కాష్ లో భారత పురుషల జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా గేమ్స్ లో భాగంగా ఇక్కడ మలేషియాతో తలపడిన భారత టీం 2-0 తేడాతో పరిపూర్ణ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు మహిళల ఈవెంట్ లో తొలిసారి రజతాన్ని చేజిక్కించుకున్న భారత్.. పురుషుల ఈవెంట్ లో కూడా మెరిసి పసిడిని కూడా తన ఖాతాలో వేసుకుంది. పురుషుల టీం ఈవెంట్ లో సౌరవ్ ఘోశల్, హరివిందర్ పాల్ సింగ్ ,కుశ్ కౌర్, మహేష్ మనోన్కర్ లు భారత్ కు స్వర్ణాన్ని సాధించిపెట్టారు.
ఈ స్వర్ణపతకంతో భారతజట్టు పతకాల పట్టికలో కొం పైకి ఎగబాకే అవకాశం వచ్చింది. దీంతో కలిపి 17వ ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు భారత్ కు మూడు స్వర్ణాలు లభించాయి.