
తండ్రి అయిన శ్రీశాంత్
స్పాట్ ఫిక్సింగ్‌లో పట్టుబడి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి అయ్యాడు. అతని భార్య భువనేశ్వరి శనివారం ఆడ శిశువుకి జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని ఈ సందర్భంగా శ్రీశాంత్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.