శ్రీలంక ఘన విజయం | Sri Lanka strolls to massive win in first Test against Bangladesh | Sakshi
Sakshi News home page

శ్రీలంక ఘన విజయం

Published Fri, Jan 31 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM

శ్రీలంక ఘన విజయం

శ్రీలంక ఘన విజయం

ఢాకా: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో శ్రీలంక జట్టు ఘన విజయం సాధించింది. ఆఫ్ స్పిన్నర్ దిల్‌రువాన్ పెరీరా (5/109) ధాటికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 51.5 ఓవర్లలో 250 పరుగులకే ఆలౌటయింది.
 
 దీంతో మరో రోజు మిగిలి ఉండగానే లంక జట్టు ఇన్నింగ్స్ 248 పరుగుల భారీ తేడాతో టెస్టును గెలుచుకుంది. ఇప్పటిదాకా బంగ్లాదేశ్‌తో 15 టెస్టులు ఆడిన లంక జట్టు 14 మ్యాచ్‌లను గెలుచుకుంది. వీటిలో ఒకటి డ్రా కాగా ఎనిమిదింటిలో ఇన్నింగ్స్ తేడాతో నెగ్గింది. జయవర్ధనేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. చివరి టెస్టు ఫిబ్రవరి 4 నుంచి చిట్టగాంగ్‌లో జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement