Daka
-
బంగ్లాదేశ్ వస్తుందా భారత్‌కు?
ఢాకా: భారత్‌లో బంగ్లా పర్యటనకు ఇంకా రోజుల వ్యవధే ఉంది కానీ... ఆటగాళ్ల అనూహ్య నిర్ణయం ఈ సిరీస్‌ను సందిగ్ధంలో పడేసింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఉన్నపళంగా సమ్మెబాట పట్టారు. కాంట్రాక్టు మొత్తాల పెంపుతో పాటు తమ డిమాండ్లు తీర్చకపోతే ఏ స్థాయి క్రికెటైనా ఆడబోమని మీడియా సమావేశంలో తెగేసి చెప్పారు. సమ్మె బావుట ఎగరేసిన వారిలో మేటి క్రికెటర్లు కెపె్టన్ షకీబుల్ హసన్, మహ్ముదుల్లా, ముషి్ఫకర్ రహీమ్ సహా మొత్తం 50 మంది ఆటగాళ్లున్నారు. దీంతో జాతీయ క్రికెట్ లీగ్‌తో పాటు భారత పర్యటనకు ఆటగాళ్ల సమ్మె దెబ్బ తగలనుంది. వచ్చే నెల 3 నుంచి భారత్‌లో బంగ్లా పర్యటన మొదలవుతుంది. ఇందులో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగమైన 2 టెస్టుల సిరీస్, మూడు టి20లు ఆడనుంది. అంతకంటే ముందే బంగ్లాలో శిక్షణ శిబిరం మొదలు కావాల్సి ఉంది. ఈ పరిణామాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కాబోయే అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. ‘ఇది పూర్తిగా బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) అంతర్గత వ్యవహారం. బీసీసీఐ పరిధిలో లేని అంశం. ఏదేమైనా సిరీస్ జరగాలనే ఆశిస్తున్నా’ అని అన్నాడు. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య కోల్‌కతాలో ఓ టెస్టు జరగనుంది. ఒకవేళ సిరీస్ జరగకపోతే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పూర్తి పాయింట్ల (120)ను భారత్‌కే కేటాయిస్తుంది. -
శ్రీలంక ఘన విజయం
ఢాకా: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో శ్రీలంక జట్టు ఘన విజయం సాధించింది. ఆఫ్ స్పిన్నర్ దిల్రువాన్ పెరీరా (5/109) ధాటికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 51.5 ఓవర్లలో 250 పరుగులకే ఆలౌటయింది. దీంతో మరో రోజు మిగిలి ఉండగానే లంక జట్టు ఇన్నింగ్స్ 248 పరుగుల భారీ తేడాతో టెస్టును గెలుచుకుంది. ఇప్పటిదాకా బంగ్లాదేశ్‌తో 15 టెస్టులు ఆడిన లంక జట్టు 14 మ్యాచ్‌లను గెలుచుకుంది. వీటిలో ఒకటి డ్రా కాగా ఎనిమిదింటిలో ఇన్నింగ్స్ తేడాతో నెగ్గింది. జయవర్ధనేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. చివరి టెస్టు ఫిబ్రవరి 4 నుంచి చిట్టగాంగ్‌లో జరుగుతుంది. -
జయవర్ధనే డబుల్ సెంచరీ
ఢాకా: మహేళ జయవర్ధనే (272 బంతుల్లో 203 నాటౌట్; 16 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్‌తో... బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక పట్టు బిగించింది. షేరే బంగ్లా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 187.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 730 పరుగుల భారీ స్కోరు చేసి డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 498 పరుగుల ఆధిక్యం లభించింది. వితనగే (103 నాటౌట్) సెంచరీ చేశాడు. మూడో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆతిథ్య బంగ్లాదేశ్ 463 పరుగులు వెనకబడి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. రెండు రోజుల ఆట మిగిలి ఉంది. అత్యధిక పరుగుల్లో ఆరో స్థానానికి... టెస్టుల్లో అత్యధిక పరుగుల జాబితాలో శ్రీలంక స్టార్ క్రికెటర్ జయవర్ధనే (11,236 పరుగులు) ఆరో స్థానానికి చేరాడు. ఈ మ్యాచ్ ద్వారా బోర్డర్ (11,174), చందర్‌పాల్ (11,219)లను అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్, పాంటింగ్, కలిస్, ద్రవిడ్, లారా మాత్రమే జయవర్ధనేకంటే ముందున్నారు. శ్రీలంక తరఫున అత్యధిక టెస్టు సెంచరీల (33) సంగక్కర రికార్డును జయవర్ధనే సమం చేశాడు.జయవర్ధనేకు కెరీర్లో ఇది ఏడో డబుల్ సెంచరీ కావడం విశేషం. -
బంగ్లాదేశ్-కివీస్ సిరీస్ డ్రా
ఢాకా: బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు కూడా డ్రాగానే ముగిసింది. చిట్టగాంగ్‌లో జరిగిన తొలి టెస్టు కూడా డ్రా కావడంతో సిరీస్ 0-0తో సమమైంది. ఇక్కడి షేర్-ఏ-బంగ్లా జాతీయ స్టేడియంలో రెండో టెస్టు చివరి రోజు ఆటకు వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో ఒక్క బంతి పడకుండానే శుక్రవారం ఆట తుడిచిపెట్టుకుపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 282, న్యూజిలాండ్ 437 పరుగులు చేయగా... రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 89 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. రెండు టెస్టుల్లోనూ సెంచరీలు చేసిన మోమినుల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ‘సిరీస్’ అవార్డులు లభించాయి. -
బంగ్లాదేశ్ 282 ఆలౌట్
ఢాకా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ బౌలర్లు రాణించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆతిథ్య జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. దీంతో షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. మంగళవారం రెండో రోజు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 282 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 33.3 ఓవర్లలో 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. విలియమ్సన్ (28 బ్యాటింగ్), టేలర్ (37 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం మెకల్లమ్సేన ఇంకా 175 పరుగులు వెనుకబడి ఉంది. బంగ్లా బౌలర్ షకీబ్ చకచకా మూడు వికెట్లు తీసి కివీస్‌ను కష్టాల్లోకి నెట్టాడు. ఫుల్టన్ (14), రూథర్‌ఫోర్డ్ (13), బ్రెండన్ మెకల్లమ్ (11) నిరాశపర్చారు. వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను తొందరగా ముగించారు. అంతకుముందు 228/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్‌ను కివీస్ బౌలర్లు వణికించారు. 54 పరుగులకే చివరి ఐదు వికెట్లు పడగొట్టారు.