ఢాకా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ బౌలర్లు రాణించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆతిథ్య జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. దీంతో షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. మంగళవారం రెండో రోజు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 282 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 33.3 ఓవర్లలో 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. విలియమ్సన్ (28 బ్యాటింగ్), టేలర్ (37 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం మెకల్లమ్‌సేన ఇంకా 175 పరుగులు వెనుకబడి ఉంది.
బంగ్లా బౌలర్ షకీబ్ చకచకా మూడు వికెట్లు తీసి కివీస్‌ను కష్టాల్లోకి నెట్టాడు. ఫుల్టన్ (14), రూథర్‌ఫోర్డ్ (13), బ్రెండన్ మెకల్లమ్ (11) నిరాశపర్చారు. వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను తొందరగా ముగించారు. అంతకుముందు 228/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్‌ను కివీస్ బౌలర్లు వణికించారు. 54 పరుగులకే చివరి ఐదు వికెట్లు పడగొట్టారు.
బంగ్లాదేశ్ 282 ఆలౌట్
Published Wed, Oct 23 2013 12:59 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM
Advertisement
Advertisement