బంగ్లాదేశ్-కివీస్ సిరీస్ డ్రా | Bangladesh impress but rain forces draw | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్-కివీస్ సిరీస్ డ్రా

Published Sat, Oct 26 2013 1:02 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

Bangladesh impress but rain forces draw

ఢాకా: బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు కూడా డ్రాగానే ముగిసింది. చిట్టగాంగ్‌లో జరిగిన తొలి టెస్టు కూడా డ్రా కావడంతో సిరీస్ 0-0తో సమమైంది. ఇక్కడి షేర్-ఏ-బంగ్లా జాతీయ స్టేడియంలో రెండో టెస్టు చివరి రోజు ఆటకు వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో ఒక్క బంతి పడకుండానే శుక్రవారం ఆట తుడిచిపెట్టుకుపోయింది.
 
  తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 282, న్యూజిలాండ్ 437 పరుగులు చేయగా... రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 89 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.  రెండు టెస్టుల్లోనూ సెంచరీలు చేసిన మోమినుల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ‘సిరీస్’ అవార్డులు లభించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement