మళ్లీ నంబర్వన్ను ఇంటికి పంపించాడు.. | Srikanth, Praneeth march into Australia Open qaurters | Sakshi
Sakshi News home page

మళ్లీ నంబర్వన్ను ఇంటికి పంపించాడు..

Published Thu, Jun 22 2017 11:16 AM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM

మళ్లీ నంబర్వన్ను ఇంటికి పంపించాడు..

మళ్లీ నంబర్వన్ను ఇంటికి పంపించాడు..

సిడ్నీ:ఇటీవల ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ను సాధించి మంచి ఊపుమీద ఉన్న తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్.. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ లో సైతం తన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 15-21, 21-13, 21-13 తేడాతో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారుడు సన్ వాన్ హో(దక్షిణాకొరియా)పై మరోసారి సంచలన విజయం సాధించి క్వార్టర్స్ లోకి ప్రవేశించాడు.

 

తొలి గేమ్ ను కోల్పోయి వెనకబడ్డ శ్రీకాంత్.. ఆపై పుంజుకుని వరుస రెండు గేమ్లను కైవసం చేసుకున్నాడు. ఇండోనేసియా ఓపెన్ లో సైతం సన్ వాన్ హోను శ్రీకాంత్ ఇంటికి పంపించిన సంగతి తెలిసిందే.  ఆ టోర్నీ సెమీ ఫైనల్లో సన్ వాన్ హోతో జరిగిన హోరాహోరీ పోరులో శ్రీకాంత్ పైచేయి సాధించాడు.

ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్లో మరొక భారత క్రీడాకారుడు సాయి ప్రణీత్ ముందంజ వేశాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయి ప్రణీత్ 21-15, 18-21, 21-13 తేడాతో హువాంగ్ యుజియాంగ్ (చైనా)పై విజయం సాధించి క్వార్టర్స్ కు చేరాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement