హైదరాబాద్: ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ బ్యాడ్యింటన్ టైటిల్ ను సాధించిన తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ ను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ పై గెలవడం ద్వారా మరొక మైలురాయిని చేరుకున్న శ్రీకాంత్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని జగన్ ఆకాంక్షించారు.
ఆదివారం జరిగిన టైటిల్ పోరులో శ్రీకాంత్ 22-20, 21-16 తేడాతో చెన్ లాంగ్ ను మట్టికరిపించాడు. 45 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్ లో రెండు గేమ్ ల్లోనూ తీవ్రమైన పోటీని ఎదుర్కొన శ్రీకాంత్ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. . ఇటీవల ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్లోనూ శ్రీకాంత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తద్వారా వరుసగా రెండో సూపర్ సిరీస్ టైటిల్ ను శ్రీకాంత్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది శ్రీకాంత్ కు తొలి ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ కాగా, సైనా నెహ్వాల్ తర్వాత ఈ ఘనతను భారత్ నుంచి సాధించింది శ్రీకాంతే కావడం మరో విశేషం. ఈ టైటిల్ ను గెలిచిన శ్రీకాంత్ కు రూ. 5లక్షల ప్రైజ్మనీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్) ప్రకటించింది.
శ్రీకాంత్ కు వైఎస్ జగన్ అభినందనలు
Published Sun, Jun 25 2017 1:00 PM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM
Advertisement
Advertisement