ఢిల్లీ: వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక 121 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత శ్రీలంకను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన లంక జట్టులో చండీమల్(21), తిలకరత్నే దిల్షాన్(36) లు మోస్తరుగా రాణించారు. అనంతరం సిరివర్ధనే(15), షనాకా(20నాటౌట్)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటారు. దీంతో శ్రీలంక 19. 3 ఓవర్లలో 120 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫంగిసో, బెహర్దియన్, అబాట్లు తలో రెండు వికెట్లు సాధించగా స్టెయిన్,ఇమ్రాన్ తాహీర్లకు ఒక్కో వికెట్ చొప్పున దక్కింది.
ఇప్పటికే ఇరు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్ కు ఎటువంటి ప్రాధాన్యత లేదు. గ్రూప్-1లో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా-శ్రీలంకలు చెరో మాత్రమే గెలిచి లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టాయి. ఈ గ్రూప్ నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే.
సఫారీల విజయలక్ష్యం 121
Published Mon, Mar 28 2016 9:00 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM
Advertisement