జింఖానా, న్యూస్‌లైన్: కోకాకోలా క్రికెట్ కప్‌ను సెయింట్ జాన్స్ చర్చ్ జూనియర్ కాలేజి కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో సెయింట్ జాన్స్ 9 వికెట్ల తేడాతో వెస్లీ బాయ్స్ కాలేజిపై నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్లీ బాయ్స్ జూనియర్ కాలేజ్ జట్టు 160 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులో శ్రీనాథ్ (51), వినీత్ రెడ్డి (61) అర్ధ సెంచరీలు సాధించి చక్కని ప్రదర్శన కనబరిచారు. సెయింట్ జాన్స్ బౌలర్స్ మిఖిల్ జైస్వాల్ 3 వికెట్లు, రిత్విక్ 4 వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన సెయింట్ జాన్స్ కేవలం ఒక్క వికెట్ నష్టానికి 161 పరుగులు చేసి విజయం సాధించింది.
మిఖిల్ జైస్వాల్ 58 పరుగులు చేయగా, భగత్ వర్మ 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టోర్నీ అంతటా ఉత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీ చైతన్య స్కూల్ జట్టు ఆటగాడు యష్ కపాడియా బెస్ట్ బ్యాట్స్‌మెన్ ట్రోఫీ అందుకోగా, బెస్ట్ బౌలర్ అవార్డు సెయింట్ జాన్స్ ఆటగాడు సీహెచ్ రిత్విక్ దక్కించుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ టైటిల్స్‌ను సెయింట్ జాన్స్ చర్చ్ ఆటగాడు మిఖిల్ జైస్వాల్ సొంతం చేసుకున్నాడు. టైటిల్ విన్నర్‌కు హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు జి. వినోద్ బహుమతిని అందించారు.
సెయింట్ జాన్స్‌కు టైటిల్
Published Sun, Sep 1 2013 12:11 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
Advertisement
Advertisement