ఎఫ్సీఏ క్రికెట్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: ఫెడరేషన్ ఆఫ్ క్రికెట్ అకాడమీస్ (ఎఫ్సీఏ) నిర్వహించిన ఇంటర్ అకాడమీ అండర్-16 టోర్నమెంట్లో సెయింట్ జాన్స్ (రెడ్) జట్టు విజేతగా నిలిచింది. గురువారం బేగంపేట పబ్లిక్ స్కూల్ గ్రౌండ్లో జరిగిన ఫైనల్లో రెడ్ 7 వికెట్ల తేడాతో సెయింట్ జాన్స్ ‘బ్లూ’ను ఓడించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన బ్లూ 29.1 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. అజయ్ దేవ్ గౌడ్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా...అభిషేక్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెడ్ 24.3 ఓవర్లలో 3 వికెట్లకు 143 పరుగులు చేసింది. నిఖిల్ 46, భగత్ 40 పరుగులు చేయగా మోనుల్ 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆఫ్ స్పిన్నర్ అభిషేక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
అండర్-16 విజేత సెయింట్ జాన్స్ రెడ్
Published Fri, May 9 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM
Advertisement