సాక్షి, హైదరాబాద్: ఈ నెల 12 నుంచి కోకాకోలా క్రికెట్ కప్ జరగనుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ), కోకాకోలా సంస్థలు సంయుక్తంగా ఈ అండర్-16 స్కూల్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నాయి. పాఠశాల స్థాయిలో ప్రతిభావంతులైన క్రికెటర్లను ప్రోత్సహించేందుకు ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు కోకాకోలా బెవరేజెస్ ఏపీ జోనల్ ఉపాధ్యక్షుడు గౌరవ్ చతుర్వేది ఒక ప్రకటనలో తెలిపారు.
తమ సత్తా నిరూపించుకునేందుకు స్కూలు క్రికెటర్లకు ఇది గొప్ప అవకాశమని హెచ్‌సీఏ కార్యదర్శి ఎం.వి.శ్రీధర్ అన్నారు. టోర్నీలో పాల్గొనేందుకు నగరంలోని 64 స్కూ ల్ జట్లు ఎంట్రీలను పంపాయి. జింఖానాతో పాటు వివిధ మైదానాల్లో 12వ తేదీ నుంచి 28వ తేదీ వరకు క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీ... నాకౌట్ పద్ధతిలో అనంతరం సూపర్ లీగ్ పద్ధతిలో జరుగుతుంది. ఫైనల్లో గెలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు రూ.50 వేలు, రన్నరప్‌కు రూ. 35 వేలు అందజేస్తారు.
12 నుంచి కోకాకోలా క్రికెట్ కప్
Published Fri, Aug 9 2013 12:44 AM | Last Updated on Fri, Sep 7 2018 2:09 PM
Advertisement