నాగ్‌పూర్: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో చిట్టబోయిన రాహుల్ యాదవ్ (తెలంగాణ), గద్దె రుత్విక శివాని (పీఎస్‌పీబీ), గుమ్మడి వృశాలి (తెలంగాణ), ఎం.తనిష్క్ (ఆంధ్రప్రదేశ్) మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. ఆదివారం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ముగిశాయి. పురుషుల సింగిల్స్ చివరి రౌండ్ మ్యాచ్‌లో రాహుల్ యాదవ్ 21–12, 21–13తో కార్తీక్ జిందాల్ (హరియాణా)పై నెగ్గగా... మహి ళల సింగిల్స్ చివరి రౌండ్ మ్యాచ్ ల్లో రుత్విక 21–8, 21–11తో మాన్సి సింగ్ (ఉత్తరప్రదేశ్)పై, వృశాలి 21–16, 21–13తో త్రిషా జాలీ (కేరళ)పై, తనిష్క్ 21–19, 21–19తో కనిక కన్వల్ (రైల్వేస్)పై విజయం సాధించారు. సోమ వారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఆర్యమాన్ (ఎయిరిండియా) తో కిడాంబి శ్రీకాంత్ (పీఎస్‌పీబీ); సాయిప్రణీత్ (పీఎస్‌పీబీ)తో రాహుల్ యాదవ్; అన్సల్ (ఉత్తరప్రదేశ్)తో పారుపల్లి కశ్యప్ (పీఎస్‌పీబీ) ఆడతారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి పీవీ సింధు...
ఇంతకాలం జాతీయస్థాయి పోటీల్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహించిన స్టార్ ప్లేయర్ పీవీ సింధు ఈ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పోటీపడ నుంది. ఇటీవలే ఆమెను ఏపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. తొలి రౌండ్‌లో రేవతి దేవస్థలే (మహారాష్ట్ర)తో సింధు ఆడుతుంది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో వృశాలితో సైనా (పీఎస్‌పీబీ); శైలి రాణే (రైల్వేస్)తో శ్రీకృష్ణప్రియ (ఆర్‌బీఐ); అనురా (ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా–ఏఏఐ)తో తనిష్క్; రసిక రాజే (ఆర్‌బీఐ)తో రుత్విక శివాని; పూర్వా (ఎయిరిండియా)తో సాయి ఉత్తేజిత రావు (ఏఏఐ) తలపడతారు.
మెయిన్ ‘డ్రా’కు రాహుల్, రుత్విక, వృశాలి
Published Mon, Nov 6 2017 4:59 AM | Last Updated on Mon, Nov 6 2017 4:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment