Qualifie match
-
ఐపీఎల్ దెబ్బకి లక్షన్నర మొక్కలు..!
-
భారత్ పరాజయం
దోహా: సాకర్ ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్‌లో భారత్‌కు తమకన్నా మెరుగైన జట్టు ఖతర్ చేతిలో పరాజయం ఎదురైంది. గ్రూప్–ఇలో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 0–1 స్కోరుతో ఓడిపోయింది. ఆట మొదలైన కాసేపటికే ఖతర్ ఆటగాళ్లు భారత గోల్‌పోస్ట్‌పై దాడులకు పదును పెట్టారు. అయితే భారత డిఫెండర్లు చురుగ్గా స్పందించడంతో నిరాశ తప్పలేదు. 13వ నిమిషంలో ఖతర్ స్ట్రయికర్ అబ్దెల్ అజిజ్ గోల్‌పోస్ట్ కుడివైపు నుంచి క్రాస్‌షాట్ ఆడగా... అది బార్‌పైనుంచి బయటకు వెళ్లిపోవడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. 30వ నిమిషంలో భారత స్ట్రయికర్ మన్వీర్ ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌వైపు దూసుకొచ్చాడు. గోల్ కోసం అతను చేసిన ప్రయత్నాన్ని డిఫెండర్లు నీరుగార్చారు. అయితే మరో మూడు నిమిషాల తర్వాత ఖతర్ బోణీకొట్టింది. 33వ నిమిషంలో యూసుఫ్ నుంచి వచ్చిన పాస్‌ను ఈ సారి అబ్దెల్ అజిజ్ ఎలాంటి పొరపాటు చేయకుండా భారత డిఫెన్స్‌ను ఛేదిస్తూ ఆతిథ్య జట్టుకు గోల్ సాధించి పెట్టాడు. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఖతర్ 1–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ద్వితీయార్ధంలో స్కోరు సమం చేసేందుకు భారత ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరకు ఖతర్ 1–0తో విజయం సాధించింది. ఆట 18వ నిమిషంలోనే డిఫెండర్ బెకెకు రిఫరీ రెడ్‌కార్డ్ చూపించాడు. దాంతో సింహభాగం మ్యాచ్‌ను భారత్ పది మందితోనే ఆడాల్సి వచ్చింది. -
మెయిన్ ‘డ్రా’కు రాహుల్, రుత్విక, వృశాలి
నాగ్‌పూర్: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో చిట్టబోయిన రాహుల్ యాదవ్ (తెలంగాణ), గద్దె రుత్విక శివాని (పీఎస్‌పీబీ), గుమ్మడి వృశాలి (తెలంగాణ), ఎం.తనిష్క్ (ఆంధ్రప్రదేశ్) మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. ఆదివారం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ముగిశాయి. పురుషుల సింగిల్స్ చివరి రౌండ్ మ్యాచ్‌లో రాహుల్ యాదవ్ 21–12, 21–13తో కార్తీక్ జిందాల్ (హరియాణా)పై నెగ్గగా... మహి ళల సింగిల్స్ చివరి రౌండ్ మ్యాచ్ ల్లో రుత్విక 21–8, 21–11తో మాన్సి సింగ్ (ఉత్తరప్రదేశ్)పై, వృశాలి 21–16, 21–13తో త్రిషా జాలీ (కేరళ)పై, తనిష్క్ 21–19, 21–19తో కనిక కన్వల్ (రైల్వేస్)పై విజయం సాధించారు. సోమ వారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఆర్యమాన్ (ఎయిరిండియా) తో కిడాంబి శ్రీకాంత్ (పీఎస్‌పీబీ); సాయిప్రణీత్ (పీఎస్‌పీబీ)తో రాహుల్ యాదవ్; అన్సల్ (ఉత్తరప్రదేశ్)తో పారుపల్లి కశ్యప్ (పీఎస్‌పీబీ) ఆడతారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పీవీ సింధు... ఇంతకాలం జాతీయస్థాయి పోటీల్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహించిన స్టార్ ప్లేయర్ పీవీ సింధు ఈ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పోటీపడ నుంది. ఇటీవలే ఆమెను ఏపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. తొలి రౌండ్లో రేవతి దేవస్థలే (మహారాష్ట్ర)తో సింధు ఆడుతుంది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో వృశాలితో సైనా (పీఎస్‌పీబీ); శైలి రాణే (రైల్వేస్)తో శ్రీకృష్ణప్రియ (ఆర్బీఐ); అనురా (ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా–ఏఏఐ)తో తనిష్క్; రసిక రాజే (ఆర్బీఐ)తో రుత్విక శివాని; పూర్వా (ఎయిరిండియా)తో సాయి ఉత్తేజిత రావు (ఏఏఐ) తలపడతారు. -
నెదర్లాండ్స్ విజయం
ఓపెనర్ స్టీఫెన్ మైబర్గ్ (36 బంతుల్లో 55; 7 ఫోర్లు; 2 సిక్స్) అర్ధ సెంచరీతో ఆకట్టుకోవడంతో టి20 ప్రపంచకప్ అర్హత మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు బోణీ చేసింది. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా యూఏఈ 19.5 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ అయ్యింది. షైమన్ అన్వర్ (19 బంతుల్లో 32; 4 ఫోర్లు; 1 సిక్స్), ఖుర్రమ్ ఖాన్ (25 బంతుల్లో 31; 4 ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోగా స్వప్నిల్ (28 బంతుల్లో 23; 2 ఫోర్లు)తో కలిసి ఖుర్రమ్ మూడో వికెట్‌కు 67 పరుగులు జోడించాడు. జమీల్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత నెదర్లాండ్స్ 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 152 పరుగులు చేసి నెగ్గింది. టామ్ కూపర్ (26 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు; 1 సిక్స్) చివరికంటా నిలిచి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. కమ్రాన్ షెహజాద్‌కు రెండు వికెట్లు దక్కాయి. కూపర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది