
దక్షిణాఫ్రికాదే టెస్టు సిరీస్
సెంచూరియన్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 204 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకుంది. మ్యాచ్ నాలుగో రోజు మంగళవారం 400 పరుగుల విజయలక్షంతో రెండో ఇన్నింగ్‌స ఆరంభించిన కివీస్ 195 పరుగులకే ఆలౌటైంది. హెన్రీ నికోల్స్ (76) మినహా అంతా విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో స్టెయిన్ 5 వికెట్లతో చెలరేగడం విశేషం. అంతకు ముందు దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్‌సలో 132 పరుగులకు ఆలౌటైంది.