
Nz vs Sa Test Series 2022: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మోచేతి గాయంతో బాధపడుతున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇంకా కోలుకోకపోవడంతో ఈ సిరీస్‌కు దూరం కానున్నాడు. అతడు ఇంకా రిహాబిలిటేషన్ సెంటర్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సారథి, స్టార్ బ్యాటర్ విలియమ్సన్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు డ్రా కాగా.. రెండో టెస్టులో బంగ్లా చారిత్రాత్మక విజయం సాధించింది. ఇక మూడో టెస్టులో కివీస్ ఘన విజయం సాధించింది.
ఇక టీమిండియాతో టెస్టు సిరీస్ విజయంతో జోరు మీదున్న దక్షిణాఫ్రికా ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. మరోవైపు... కివీస్ జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ విలియమ్సన్ దూరం కాగా రాస్ టేలర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఇద్దరు కీలక ప్లేయర్లు లేకుండానే కివీస్... ప్రొటిస్ జట్టుతో పోరుకు సిద్ధమవుతోంది. ఇక బంగ్లాతో సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌లకు సారథ్యం వహించిన టామ్ లాథమ్ ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment